నేటి భారతీయ సమాజం మత, కులాలపై ఆధారపడి పయనాన్ని సాగిస్తోంది. ఇవే లేకపోతే దేశం మరింత ప్రగతిపధంలోకి దూసుకెళ్లేదని మైకు పట్టుకున్న ప్రతీ నాయకుడు చెప్పే విషయమే. అయితే అది అంబేద్కర్ జయంతి రోజునో.. లేద స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల రోజునో అదీ కాకపోతే గాంధీజయంతి రోజునో చెబుతుంటారు. అయితే ఆ కార్యక్రమాలు ముగిసిన తరువాత తమ దారి తమదనే వెళ్లిపోతారు. ఏం చేసినా వారు చెప్పిన మాటలకు వారు కట్టబుడి ఉండరు. ఇలా దాదాపుగా అందరు నేతలు చేసేదే. అయితే ఈ నేత మాత్రం అందుకు పూర్తి భిన్నం.
కుల సమాజం అన్నది లేదని, అందరూ ఒక్కటేనని చెప్పిన ఆయన ఆ మాటకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. వీళ్లు తక్కువ కులం. వాళ్లు అగ్రవర్ణం ఇలాంటి తేడాలతో మనకు మనమే హద్దులు ఏర్పర్చుకుని.. అందులోనే బతుకుతున్నామని.. ఇంకా ఎంతకాలం ఇలాంటి కులహద్దులని ఆయన ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి.. 75 ఏళ్లు కావస్తున్న తరుణంలోనూ ఇలా పయనించడం సమంజసం కాదని అన్నారు. ఎవరూ తక్కువ కాదు.. ఎక్కువ కాదు అని ఆయన దళితుడు స్వామిజీ నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించి తిన్నారు. ఆయనే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్.
#WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS
— ANI (@ANI) May 22, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more