FDA-Approved Eye Drug Can Improve Close-Up Vision ‘వ్యూటీ’ ఐ డ్రాప్స్‌తో చత్వారానికి, కళ్లద్దాలకు చెక్..

New fda approved eye drug can improve close up vision and reduce need for reading glasses

new drug, Pilocarpine eye drops, Vuity, pharmacies, reading glasses, millions of people, age-related blurry vision, Food and Drug Administration, United States

A new drug aimed at improving close-up vision is now available by prescription at pharmacies in the United States. Pilocarpine eye drops — sold under the brand name Vuity — may replace reading glasses for millions of people who suffer from age-related blurry vision. The drug was approved by the Food and Drug Administration in October and became available to the public this week.

చత్వారనికి కళ్లద్దాలకు చెక్ పేట్టే గుడ్‌న్యూస్.. ‘వ్యూటీ’ బ్రాండ్ పేరుతో ఐ డ్రాప్స్‌

Posted: 05/24/2022 11:54 AM IST
New fda approved eye drug can improve close up vision and reduce need for reading glasses

మనిషిలోని శక్తి సన్నగిల్లుతుందని చెప్పేది తొలుత కళ్లు మాత్రమే. మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఇలా ఏ దీర్ఘకాలిక వ్యాధి సోకుతున్నా.. ముందుగా హెచ్చరించేది నేత్రాలే. అందుకనే సర్వేంద్రియానం నైనం ప్రధానం అన్న సూక్తి తెరపైకి వచ్చింది. కళ్లు మంచిగా ఉన్నంతవరకు మనకు ఏలాంటి అరోగ్యసమస్యలు లేవన్న ధీమాగా ఉండవచ్చు. అయితే.. ప్రస్తుతం 40 ఏళ్లు పైబడిన వారికి కళ్లు మసకగా ఉంటాయి. దగ్గర్లోని వస్తువులు కూడా సరిగ్గా కనపించవు. అదే చత్వారం (ప్రెస్బయోపియా). అయితే చత్వారంతో బాధపడే వారు ఏమీ చదవలేరు. వారికి కళ్లు కనిపించక ఇబ్బందులు కూడా పడుతుంటారు.

ఇందుకోసం నేత్రవైద్యులను ఆశ్రయిస్తే వారు అటు ఔషదాలు రాయడంతో పాటు మరోవైపు కళ్లద్దాలను కూడా రాస్తారు. మందులంటే గుర్తుపెట్టుకుని మరీ వేసుకుంటారు. కానీ అలవాటు లేని కళ్లద్దాలు పెట్టుకోవడమంటే చాలామంది అయిష్టం వ్యక్తం చేస్తారు. కొందరు అబ్బా కళ్లజోడు చాలా బరువుగా ఉందని, మరికొందరు మరోకారణం చేతనో వాటిని పక్కనపడతారు. అయితే వాటిని పక్కనబెడితే కంచి చూపు ఎలా మెరుగవుతుందని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తుంటారు. అయితే ఇలాంటివారి కోసం మరో కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. ఇకపై కళ్లద్దాలు పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ.. ఈ మందు వేసుకుంటే చాలు కళ్లు అద్దాలు పెట్టుకున్నట్లుగానే కనిపిస్తాయి.

ఇది చుక్కల మందు. దీనిని ఒక్క చుక్క కంట్లో వేసుకుంటే.. కళ్లు దాదాపుగా ఆరు నుంచి ఏడు గంటల పాటు స్పష్టంగా కనిపిస్తాయి. అదే వ్యూటీ. సరికొత్త ఔషధం. దీనిని కంటిలో వేసుకున్న 15 నిమిషాలకే కళ్లలో మసకపోయి స్పష్టంగా చూడగలుగుతారు. అలాగే పుస్తకాలు, పేపర్లను చదువుకోవచ్చు. ఇదొచ్చిన వారు కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకాలు చదవలేరు. దీంతో ఇలాంటి వారి కోసం ‘వ్యూటీ’ చుక్కల మందు అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి అనుమతిని ఇచ్చింది. కన్ను పనిచేసే తీరును బట్టి ఈ చుక్కల మందు పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎఫ్‌డీఐ అనుమతితో చత్వారాన్ని సరిచేసే తొలి చుక్కల మందుగా ‘వ్యూటీ’ రికార్డులకెక్కింది. అయితే ఇది కేవలం క్లోజ్-అప్ (దగ్గరి)దృష్టిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన కొత్త ఔషధం ఇప్పుడు అమెరికాలోని ఫార్మసీలలో ప్రిస్క్రిప్షన్ ద్వారా అందుబాటులో ఉంది. పిలోకార్పైన్ కంటి చుక్కలు - వ్యూటీ బ్రాండ్ పేరుతో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వయస్సు-సంబంధిత అస్పష్టమైన దృష్టితో బాధపడుతున్న మిలియన్ల మంది వ్యక్తుల కోసం రీడింగ్ గ్లాసెస్ వ్యూటీ ప్రత్యామ్నాంగా మారనుంది. అక్కడి మీడియా ప్రకారం వ్యూటీకి ఔషధానికి అక్టోబర్‌లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆమోదం లభించింది. కాగా ఈ వారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ప్రతి కంటిలో ఒక చుక్క 6 నుండి 10 గంటల వరకు వినియోగదారులకు పదును చూపుతుంది. వ్యూటీ యొక్క 30 రోజుల సరఫరా ధర అమెరికాలో సుమారు $80గా నిర్ధేశించబడింది. కాగా వ్యూటీ కంటి చుక్కల మందుతో దూర దృష్టిని ఏమాత్రం ప్రభావితం కాదు. దీంతో ఇది కేవలం పెద్దవయస్కులైన వారి సమీపదృష్టితో పాటు మధ్యస్థ దృష్టిని మెరుగుపరుస్తుంది. ఛత్వారంతో బాధపడుతున్న మిలియన్ల మంది అమెరికన్ల కోసం ఈ మొదటి రకం చికిత్సను ఊహించిన దానికంటే త్వరగా మార్కెట్‌లోకి తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది" అని అలెర్గాన్ మెడికల్ థెరప్యూటిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగ్ దోసాంజ్ తెలిపారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles