కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం ఇప్పుడు ఆందోళనకు దారితీసింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడంపై నిరసన మెుదలైంది. దీంతో జిల్లాలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. గతంలో జిల్లాకు పేరు పెట్టాలని ఉద్యమం జరిగితే.. ప్రబుత్వం పట్టించుకోలేదు. తాజాగా పేరు మారుస్తూ జీవో రావడంతో.. ఉద్యమం రగులుకుంది. దీంతో అనేక మంది నిరసనకు దిగారు. కోనసీమ జిల్లానే ముద్దు అంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాత్కాలిక ప్రయోజనాల కోసమే.. పేరు మార్చారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. కోనసీమ అంటే.. ఒక ఎమోషన్ అని.. ఇలాంటి ప్రాంతం ఎక్కడా లేదని.. పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా పేరు మారుస్తున్నట్టుగా జీవో రావడంతోనే మెల్లగా మెుదలైన వ్యతిరేకత ఆ ప్రాంతమంతా వ్యాపించింది. మార్పుకు ముందు.. అక్కడి ప్రజలతో మాట్లాడి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. ప్రభుత్వం స్వార్థం కోసం.. రాజకీయంగా లబ్ది పొందేందుకు.. కోనసీమ పేరు మార్చిందని కొంతమంది చెబుతున్నారు. జిల్లాల విభజన చేశారు గానీ.. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించారా అనే ప్రశ్న మెుదలైంది. వ్యతిరేకతను ప్రభుత్వం ముందుగానే అంచనా.. వేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి ఇంటికి నిప్పు
కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడంపై చేపట్టిన నిరసన కొనసాగుతోంది. ర్యాలీ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించారు. ఈ కారణంగా ఆయన ఇల్లు మంటల్లో చిక్కుకుంది. కుటుంబసభ్యులు ఇంటి నుంచి పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో ఇరువైపులా గాయాలు అయ్యాయి.
కొన్ని రోజులుగా.. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడంతో ఆందోళన మెుదలైంది. పేరు మార్చడం సరికాదని.., కోనసీమ జిల్లాగానే ఉంచాలని నిరసన సెగ తగిలింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన జరిగింది. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పును అంగీకరించబోమంటూ యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ప్రజలతో ముందుగానే చర్చించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు కూడా పెట్టాలన్న డిమాండ్లు వచ్చాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. దానికి ప్రధాన పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయన్నారు. అందుకే కోనసీమ అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టామన్నారు. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ మహానుభావుడు. ఆయనకు ఆ విధంగా గౌరవం ఇచ్చామని చెప్పారు. దీన్ని అన్ని పార్టీలు సమర్థించాయన్న సజ్జల వద్దు అని ఎవరూ అనలేదన్నారు.
'భరత మాత ముద్దుబిడ్డల్లో అంబేడ్కర్ ముందుంటారు. ఏవో కొన్ని శక్తులు ఇవాళ్టి గొడవ వెనక ఉండి ఉండొచ్చు. పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేస్తారు. పరిస్థితి చక్కబడుతుంది. జిల్లాకు పేరు మార్పు రాజకీయ మైలేజీ కోసం చేయలేదు. అందరి అభిప్రాయం మేరకే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఇలాంటి గొడవలు ఉత్పన్నమైనా వెంటనే సమసిపోతాయని భావిస్తున్నాం. పరిస్థితిని తప్పనిసరిగా అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాం.' అని సజ్జల అన్నారు.
అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోం మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే పేరు మార్చామన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని చెప్పారు. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమని మంత్రి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more