జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాష్ట్రంలోని వాయువ్య కాశ్మీర్ ప్రాంతంలోగల బారాముల్లా జిల్లాలోని ఖేరీ ప్రాంతంలో ఇవాళ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భారత భద్రత బలగాలు పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. బరాముల్లా జిల్లాలోని ఖేరీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు నాజీభట్ క్రాసింగ్ ప్రాంతం మీదుగా వెళ్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపాయి.
బరాముల్లా జిల్లాలోని ఖేరి ప్రాంతంలో నక్కి ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను లొంగిపోవాలని సూచించేందుకు భారత భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. స్థానిక పోలీసులు.. భద్రతా దళాలతో కలసి ఖేరీ ప్రాంతానికి చేరుకునేందుకు వెళ్తుండగా, నాజీభట్ క్రాసింగ్ వద్దకు చేరిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపడం ప్రారంభించారు. దీంతో హుటాహుటిన స్పందించిన భద్రతా దళాలు వారిపైకి ప్రతిదాడులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరణించారు. అయితే స్థానికంగా ఇంకా కోందరు ఉద్రగవాదుల నక్కివున్నారు. దీంతో వారిని లొంగిపోవాలని సూచిస్తూనే.. భారత భద్రతా బలగాలు వారి కాల్పులకు ధీటుగా సమాధానం ఇస్తున్నాయి.
ఈ క్రమంలో కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ వీరమరణం పోందాడు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో జేకేపీ జవాన్ వీరమరణం పొందారని కాశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. జవాను కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇక స్తానికంగా నక్కిన ఉగ్రవాదులు.. భారత బలగాలను చూసి, వారి పైకి కాల్పులు జరిపాయి. సైన్యం సైతం ప్రతిగా కాల్పులు జరుపడంతో ముగ్గురు హతమయ్యారని తెలిపారు. ముగ్గురు పాక్కు చెందిన ఉగ్రవాదులని తెలిపారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more