ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అచ్చంగా ఇలా హైరానా పడిపోయిన ఓ టీచర్.. తన అకౌంట్లోంచి డబ్బులు కట్ అయ్యాయని చేయకూడని పని చేసి.. వందల రూపాయల కోసం వెళ్లి దాదాపుగా రెండు లక్ష రూపాయలను పోగొట్టుకున్నాడు. తీరా తాను తొందరపడి చేసిన పనితో.. భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలుసుకుని బాధపడతున్నాడు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు ఓ టీచర్. అయితే టికెట్ బుక్ కాలేదు.. కానీ తన అకౌంట్లోంచి డబ్బులు మాత్రం కట్ అయ్యాయి. దీంతో కంగారుపడిన ఆయన తన డబ్బును అనవసరంగా తీసుకున్నారని భావించి.. వాటిని తిరిగి పోందేందుకు ప్రయత్నించాడు. అయితే డబ్బులు రిఫండ్ ఎలా వస్తాయన్న విషయం తెలియక ఐఆర్సీటీసీ హెల్ప్ లైన్ నెంబరు కోసం వెతికాడు. అయితే అతినిక ఎక్కడా నెంబరు కనిపించకపోవడంతో..నేరుగా గూగుల్ సర్చ్ లోకి వెళ్లి అక్కడ వెతకగా ఓ నెంబరు కనిపించింది.
అంతే ముందు వెనుక అలోచించకుండా డబ్బుల కోసం ఆరాటపడి.. ఆ ఫోన్ నెంబరు నిజంగానే ఐఆర్సీటీసీ వారిదని భావించి దానికి కాల్ చేశాడు. తన డబ్బులు తనకు వస్తాయని భావించే లోపు తన ఫోన్ కు వచ్చిన మసేజ్ చూసి గుండెలు బాదుకున్నాడు. తన ఖాతా నుంచి కట్ అయిన డబ్బులు రాకపోగా.. తన ఖాతాలో నుంచి ఏకంగా రెండు లక్షల రూపాయల డబ్బు కూడా పోయిందని తనకు వచ్చిన పోన్ మెసేజ్ ద్వారా తెలుసుకున్నాడు. తన ఖాతా నుంచి ఏకంగా రూ.1.78 లక్షలు పోగొట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ట్యూషన్ టీచరుగా పనిచేసే సదరు బాధితుడు నాసిక్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవడం కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లాడు.
అయితే ఏదో సాంకేతిక సమస్య కారణంగా టికెట్ బుక్ అవ్వలేదు. తన ఖాతాలో కట్ అయిన రూ.578 తిరిగి రాకపోవడంతో అతను రిఫండ్ కోసం ప్రయత్నించాడు. ఐఆర్సీటీసీ హెల్ప్‌లైన్ నెంబరు కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఒక నెంబరు దొరికింది. కానీ అది ఒక సైబర్ మోసగాడి నెంబరు. ఈ విషయం తెలియని బాధితుడు ఆ నెంబర్‌కు కాల్ చేయడంతో.. అతన్ని మోసగించిన సైబర్ మోసగాడు. ఏకంగా రూ.1.78 లక్షలు కాజేశాడు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న ట్యూషన్ టీచర్.. పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more