ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది వచ్చి.. వేగంగా ఇతరులకు సోకుతున్న వేరియంట్ ఒమిక్రాన్ మాత్రం.. రోగుల ఊపిరితిత్తులపై కాకుండా గెండెపై తీవ్రప్రభావాన్ని చూపుతున్నాయని ఇటీవల మనదేశంలోని ప్రముఖ కార్డియాలజిస్టులు సందేహాలు వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారికి సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలకు ఊపిరితిత్తులు దెబ్బతినడమే కారణమని ఇప్పటి వరకు భావించగా, దీంతోపాటు మరో నిజం కూడా వెలుగులోకి వచ్చింది. వైరస్ ఊపిరితిత్తుల్లో ఉండిపోయి వాటి పనితీరును దారుణంగా దెబ్బతీస్తుందని ఇప్పటి వరకు నిర్వహించిన పరిశోధనల్లో తేలగా, తాజాగా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, ఎన్హెచ్ఎస్ గోల్డెన్ జూబ్లీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో మరో విస్తుపోయే విషయం వెల్లడైంది. కరోనా వైరస్ ఊపిరితిత్తులతో పాటు గుండె పనితీరును కూడా దారుణంగా దెబ్బతీస్తుందని ఈ పరిశోధనలో తేలింది.
ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే గుండెలోని కుడివైపు భాగంపై వైరస్ తీవ్రప్రభావం చూపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐసీయూలలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న 121 మంది రోగులపై అధ్యయనం చేసిన అనంతరం వారీ విషయాన్ని వెల్లడించారు. తాము పరిశీలించిన ప్రతి ముగ్గురిలో ఒకరికి గుండె కుడివైపు దెబ్బతింటోందని, దీనివల్ల మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీంతో కరోనా సోకడంతో గుండెపోటుకు కూడా గురై మరణించిన వారు చాలామంది ఉన్నారని అవన్నీ కూడా కరోనా మరణాలుగానే పరిగణలోకే వస్తాయని అంటున్నారు వైద్యులు.
కరోనా కారణంగా ఊపిరితిత్తులు బలహీనపడడం వల్ల అవి రక్తాన్ని స్వీకరించలేకపోతున్నాయని, అయితే, గుండె మాత్రం రక్తం పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఫలితంగా గుండెపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధకుల్లో ఒకరైన కార్రడియోథొరాసిక్ ఎనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ విభాగానికి చెందిన ఫిలిప్ మెక్కాల్ పేర్కొన్నారు.కరోనా వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది కాబట్టి, ఇకపై మరింత మెరుగైన చికిత్స ద్వారా దానిని అధిగమించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన గోల్డెన్ జూబ్లీ ఇంటెన్సివ్ కేర్ నిపుణుడు బెన్ షెల్లీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more