సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్‌కు బెంగళూరులో పరాభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం కర్ణాటక రాజధాని బెంగళూరుకు విచ్చేసిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా, అయనపై కొందరు దుండగులు ఇంకు(సిరా) దాడి చేశారు. నూతన వ్యవసాయ సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం మెడలు వంచి మొక్కవోని దీక్షతో ఉపసంహరించుకునేలా చేసిన నేతకు బెంగళూరులో ఈ విపత్కర పరిణామం ఎదురుకావడం గమనార్హం. ఈ పరిణామంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఈ క్రమంలో వెంటనే తేరుకున్న కార్యక్రమ నిర్వహకులు.. సిరా దాడి చేసినవారిని అడ్డుకున్నా అప్పటికే వారు ఆయన ముఖంపై సిరాను చల్లారు. దీంతో ఆగ్రహించిన నిర్వాహకులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు తిరగబడ్డారు. దీంతో వారిని కట్టడి చేయడానికి నిర్వాహకులు వారిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తరువాత ఆయన తనపై సిరా దాడి జరగడం పట్ల తీవ్రంగా స్పందించారు. తన కార్యక్రమానికి పోలీసులు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. కొందరితో ప్రభుత్వం కుమ్మక్కై ఇలా చేసిందని ఆరోపించారు.
పోలీసుల అదుపులో ముగ్గురు: భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయిత్పై సిరా దాడి ఘటనపై చర్యలు చేపట్టారు బెంగళూరులోని హైగ్రౌండ్స్ ఠాణా పోలీసులు. ఇంక్ చల్లినట్లు భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా, కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బు తీసుకుంటూ మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్, సింగ్‌లు వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇవ్వబోతుండగా.. కొందరు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. దాడికి పాల్పడింది చంద్రశేఖర్ మద్ధతుదారులేనని టికాయత్ చెప్తున్నారు.
#WATCH Black ink thrown at Bhartiya Kisan Union leader Rakesh Tikait at an event in Bengaluru, Karnataka pic.twitter.com/HCmXGU7XtT
— ANI (@ANI) May 30, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more