నగరంలోని కొందరు బడాబాబులు, సెలబ్రిటీలు వారాంతాల్లో బార్లు, పబ్‌లకు వెళ్లి అక్కడ లేట్ నైట్ పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే పక్క సమాచారంతో ఇలా అనుమతులు అతిక్రమించి లేట్ నైట్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్ లు బార్లపై పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పంజా విసురుతున్నారు. పబ్ నిర్వహకులతో పాటు సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి.. కటకటల్లోకి నెడుతున్నారు. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై లో మాదకద్రవ్యాలు వినియోగం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో దానిపై దాడి చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రేవ్ పార్టీలు బహిర్గతం చేశారు. ఇక అప్పటి నుంచి నగరంలోని పబ్ లపై దృష్టి సారించారు.
తాజాగా రామ్‌గోపాల్‌పేటలోని క్లబ్ టెకీలపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్‌లోని ఎనిగ్మా పబ్‌పై స్థానిక పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేయడంతో వీటి కేంద్రంగా జరుగుతున్న ‘డ్యాన్సుల’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన నగర పోలీసులు అన్ని క్లబ్బుల పైనా నిఘా ముమ్మరం చేశారు. పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనిబోమని పోలీసులు తేల్చిచెబుతున్నారు. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసి పబ్‌గా మార్చేసినట్టు పోలీసులు దాడుల్లో బటభయలైంది.
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ బార్ డాన్సర్లుగా మార్చేశారు. ఇక వీరితో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ.. క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. ఇక అనుమతులు లేకుండా పబ్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా. అసభ్యకర నృత్యాలపై నిర్లక్ష్యం వహించిన స్థానిక సిఐ సైదులుపై సీపీ సివి ఆనంద్ చర్యలు తీసుకున్నారు. ఆయనను కమీషనరేట్ కు అటాట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more