7 Dead, 12 Injured as Hyderabad-Bound Private Bus బస్సు ప్రమాద ఘటన: ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు..

7 dead 12 injured as hyderabad bound private bus catches fire in karnataka s kalaburagi

bus catches fire,Goa, Hyderabad bound bus, Kalaburagi bus accident, kamalapuram bus accident, Karnataka bus tragedy, Karnataka bus accident, hyderbad families, 7 dead, 12 injured, kamalapuram, mini lorry, speeding bus, kalaburagi, Karnataka, crime

In a major tragedy, at least seven people were charred to death after a Hyderabad-bound sleeper bus caught fire in the early hours of Friday in Kalaburagi district of Karnataka. All the deceased persons hailed from Hyderabad, according to sources. Around 12 passengers were injured and have been admitted to a hospital in Kalaburagi.

ITEMVIDEOS: బస్సు ప్రమాద ఘటన: ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు..

Posted: 06/03/2022 01:36 PM IST
7 dead 12 injured as hyderabad bound private bus catches fire in karnataka s kalaburagi

జన్మదిన వేడుకలకు హాజరై ఎంతో ఎంజాయ్ చేసి తిరిగి ఇళ్లకు బయలుదేరిన ఆ రెండు కుటుంబాల పాలిట మినీలారి మృత్యుశకటంగా మారింది. కర్ణాటకలో కలబురిగి జిల్లా కమలాపురంలో అడ్డువచ్చిన మినిలారీని ఢీకోట్టిన బస్సు బోల్తాపడి ఒక్కసారిగా మంటలు రేగాయి. క్షణాల్లో అవి పెద్దగా చెలరేగి.. కనీసం కన్నవాళ్లకు కడసారి చూపు కూడా దక్కనీయకుండా చేశాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 8 మంది ప్రాణాలు సజీవదహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన తిరిగి వస్తున్న హైదరాబాదుకు చెందిన రెండు కుటుంబాల్లో ఈ ఘోర ప్రమాదం పెనువిషాధాన్ని నింపింది.

32 మంది సభ్యులతో గోవా నుంచి తిరుగు ప్రయాణమైన బస్సు ప్రమాదానికి గురికావడంతో పలువురు గాయపడగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ సహా 35 మందితో కూడిన ప్రైవేటు బస్సు గోవాలో జరిగిన జన్మదిన వేడుకలను ముగించుకుని గురువారం రాత్రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యింది. బస్సులో ఒక కుటుంబానికి చెందిన 11 మంది.. మరో కుటుంబానికి చెందిన 21 మందితో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు. తెల్లవారుజామున కర్ణాటకలోకి ప్రవేశించిన ట్రావెల్స్‌ బస్సు బీదర్‌- శ్రీరంగపట్టణం హైవే మీదుగా హైదరాబాద్ కు వస్తున్న తరుణంలో కమలాపుర వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మినీ లారీని బస్సు ఢీకొట్టింది.

దీంతో వేగంగా వస్తున్న బస్సును అదుపు చేయడంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డు పక్కన దూసుకెళ్లి బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బస్సు అంతటికి వ్యాపించడంలో పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బస్సులో ఉన్న పలువురిని రక్షించారు. బస్సు అద్దాల పగలకొట్టి వారిని కాపాడారు. అయితే ఈ లోపే మంటలు విస్తరించడంతో బస్సులోని.. ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వైద్యం కోసం క్షతగాత్రులను కలబురిగి జిల్లా ఆసుపత్రితో పాటు యునైటెడ్, గంగా ఆసుపత్రులకు తరలించారు. మంటల్లో తీవ్రగాయాలపాలైన మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిని లారీ డ్రైవర్‌కు సైతం తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందినదిగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో బీవన్‌, దీక్షిత్‌ అనే ఇద్దరితో పాటు రవళి, సరళాదేవి, అర్జున్‌ శివకుమార్‌, అనితారాజు, శివకుమార్​ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderbad families  7 dead  12 injured  kamalapuram  mini lorry  speeding bus  kalaburagi  karnataka  crime  

Other Articles