Maha COVID Restrictions: Mask Compulsory In Public Places మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు.. పెరుగుతున్న కోవిడ్ కేసులు

Maharashtra government asks officials to ramp up covid testing as cases rise

Maharashtra covid cases, Maharashtra mask compulsory, Maharashtra mask mandatory public places, maharashtra Covid news, Covid cases, rise in covid cases in Maharashtra, Corona Cases, Covid cases, Coronavirus, covid restrictions, mask mandatory, rise in corona cases, Maharashtra, Crime

Amid rise in covid cases in the state, Maharashtra government has made it compulsory for the citizens to wear masks in public places except open spaces. Additional Chief Secretary, Dr Pradeep Vyas, in a letter to all district authorities, gave out several orders including ones for mandating the wearing of masks in public places.

మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు.. పెరుగుతున్న కోవిడ్ కేసులు

Posted: 06/04/2022 04:37 PM IST
Maharashtra government asks officials to ramp up covid testing as cases rise

దేశ‌మంతా మ‌ళ్లీ క‌రోనా తిరగ‌బెడుతున్న‌ది. గ‌త మూడు రోజుల్లో దేశ‌వ్యాప్తంగా రెట్టింపు కేసులు న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ‌వ్యాప్తంగా 3962 కేసులు నమోదు కాగా, అంతకుముందు రోజు 4,041 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. మార్చి 11 త‌ర్వాత ఇదే అత్య‌ధికం. దాదాపు క‌రోనా ఆంక్ష‌ల‌న్నీ ఎత్తేయ‌డంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త వేరియంట్ల‌తో మ‌రో వేవ్ బ‌లోపేతం అవుతుంద‌న్న ఆందోళ‌నలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేసులు పెరుగుతున్న ఐదు రాష్ట్రాల‌కు క‌రోనా ఆంక్ష‌లు క‌ట్టుదిట్టంగా అమ‌లు చేయాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ లేఖ‌లు రాసింది.

తొలి నుంచి క‌రోనాకు హాట్‌స్పాట్‌గా ఉన్న మ‌హారాష్ట్ర‌లో పాజిటివ్ కేసుల్లో పెరుగుద‌ల క‌నిపిస్తున్న‌ది. ఈ వారంలో పాజిటివిటీ రేట్ 8 శాతం పెరిగింది. దేశ ఆర్థిక రాజ‌ధానిగా పేరొందిన ముంబైలో 231 శాతం కొత్త కొవిడ్‌-19 కేసులు పెరిగాయి. మే నెలలో కేవ‌లం 215 కేసులు మాత్ర‌మే న‌మోదైన ముంబైలో ఎక్కువ మంది మ‌హ‌మ్మారి భారీన ప‌డ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని క‌ఠినంగా పర్య‌వేక్షిస్తూ.. ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐదు రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌లు రాసింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తాజాగా కోవిడ్ అంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాలతో పాటు సినిమాహాళ్లు, ఆడిటోరియంలు, రైళ్లు, బస్సులు, కార్యాలయాలు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలు వంటి మూసి ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మాస్కును ధరించడం మళ్లీ తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆందోళన వ్యక్తం చేసింది. అడిషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ప్రదీప్ వ్యాస్ అన్ని జిల్లాల అధికారులకు రాసిన లేఖలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles