అమెరికా, యూరప్ దేశాల్లోనే పాకిన మంకీపాక్స్.. ఇప్పుడు మన దేశంలోకీ ప్రవేశించిందా? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ చిన్నారి నమూనాలను అధికారులు సేకరించి, పరీక్షల కోసం పంపారు. ఆ చిన్నారికి చర్మం పగుళ్లు, దురద, దద్దుర్ల వంటి లక్షణాలు వచ్చాయని, ఆమెకి ఇంతకుముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. గత నెలరోజుల్లో విదేశాలకు వెళ్లి వచ్చిన దాఖలాలూ లేవన్నారు.
ప్రస్తుతానికి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ముందు జాగ్రత్త చర్యగా టెస్టులకు పంపామని తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమైన మంకీపాక్స్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 700కుపైగా మంకీపాక్స్ కేసులు వచ్చాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిన్న ప్రకటించింది. అమెరికాలో 21 మంది దాని బారిన పడినట్టు వెల్లడించింది. కెనడాలో 77 మందికి అది సోకింది. అయితే మంకీపాక్స్ అంత తీవ్రమైన వ్యాధి ఏం కాదని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
ఈ వ్యాధికి సంబంధించి దద్దుర్లు, జ్వరం, వణుకుడు, నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికాకే పరిమితమైన ఈ వ్యాధి.. మేలో యూరప్ దేశాలకు పాకింది. అక్కడి నుంచి అమెరికా, కెనడాలకూ వ్యాపించింది. ప్రస్తుతం మంకీ ఫాక్స్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. దేశంలో ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్ దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో వెలుగు చూసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more