దేశంలో నిర్భయ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి చేరకుంటుందా.? అన్న ప్రతినిత్యం అమె కుటుంబ సభ్యులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. నిర్భతలాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు ఏమాత్రం జంకడంలేదు. అమ్మాయిలు కనబడితే చాలు కామవాంఛతో రెచ్చిపోతున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అన్న తేడా లేకుండా వీరిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక నడి వయస్కులే కాదు వృద్ద మహిళలపైనా లైంగికదాడులకు తెగబడుతున్నారంటే.. పురుషజాతిలో పశువాంఛ ఎంత దారుణంగా తయారైందో ఇట్టే అర్థమవుతుంది.
ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్యవిద్యార్థినిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నేరస్తులకు శిక్ష పడినా.. ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా.. బీహార్‌లో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్‌లో కొందరు దుర్మార్గులు 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బీహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బస్ డ్రైవర్, కండక్టర్, హెల్పర్ సహా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో బాలిక వెస్ట్ చంపారన్‌లోని బెట్టయ్య ప్రాంతానికి వెళ్లడానికి ఎదురుచూస్తూ ఉంది. ఈ క్రమంలో బస్ రాగా.. ఆమె దానిని ఆపింది. అయితే.. వివరాలు అడగగా.. బస్ డ్రైవర్ బెట్టయ్య ప్రాంతానికే వెళ్తున్నట్లు చెప్పడంతో బాధితురాలు నమ్మింది. అనంతరం బాలిక బస్ ఎక్కగానే ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇవ్వగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత బాలికపై బస్ డ్రైవర్, కండక్టర్ సహా మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. బాలిక స్పృహలోకి రాగానే.. బస్సు డోర్లు వేసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వారు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికను బెట్టియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటనలో బస్‌ను సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేశామని బెట్టియా పోలీసు అధికారి ముకుల్ పాండే తెలిపారు. పోక్సో తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సేకరించిన సాక్ష్యాల విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నట్లు పాండే తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more