రాష్ట్రపతి ఎన్నిక తేదీ సమీపిస్తోన్న వేళ విపక్షాలు ఇప్పటికే చర్చలు నిర్వహిస్తూ.. తమ అభ్యర్థిపై స్పష్టతను తీసుకువచ్చేందుకు సహ్నాహాలు చేస్తున్నాయి. ఇక అధికార ఎన్డీఏ పక్షం మాత్రం ఇప్పటికీ ఇంకా అభ్యర్థిపై స్పష్టతనే ఇవ్వలేదు. ఈ పదవిలో రెండో పర్యాయం ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూర్చోబెడతారా.? లేక ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును బరిలోకి దింపుతారా.? అన్న విషయమై క్లారిటీ కూడా లేదు. అది ఇవాళ్టి ఉదయం వరకు. కానీ ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే.. వెంకయ్యనాయుడినే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దించాలని బీజేపి అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకు ఇవాళ జరిగిన పరిణామాలే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ విషయమై బీజేపి పెద్దలు వెంకయ్య నాయుడితో సమావేశం కావడమే సంకేతాలను బలపరుస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వెంకయ్యనాయుడు నివాసానికి చేరుకున్న పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లు వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో వారు వెంకయ్యనే తమ అభ్యర్థిగా ప్రతిపాదించారని సమాచారం.
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును పురస్కరించుకుని ఈ ఉదయం వెంకయ్య నాయుడు సికింద్రాబాద్లో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భీజేపీ నేతలతో భేటీ నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపి పార్లమెంటరీ పార్టీ భేటీ కానున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇవాళ సాయంత్రం బీజేపి ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఈ ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో బీజేపి ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పలువురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు కూడా ఉంది. ఇక మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశమై తమ అభ్యర్థిని ఖరారు చేయనున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, మహాత్మగాందీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లాలు వున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more