కర్నాటక ప్రతిపక్ష జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ తన నియోజకవర్గం మాండ్యా.. అన్ని విధాల అభివృద్దిలో అగ్రగామిగా ఉండేలా చూసుకుంటూన్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిదిశగా మాండ్యా పయనిస్తున్నా.. ఆయన చేసిన తప్పిదం ఆయన చేసే మంచిపనులను పక్కనపెట్టిస్తోంది. ఎమ్మెల్యేగా ఆయన చేసిన తప్పడు పనులనే పెద్దగా చూపుతోంది. ఇంతకీ ఇలా చేసేది ఎవరు అని అంటారా.? మరెవరో కాదు.. నెటిజనులు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే నెటిజనులు ఆయన కోపాన్ని మాత్రమే సెల్ ఫోన్లలో బంధించి.. ఆయనను అబాసుపాలు చేస్తున్నారు.
ఇప్పుడాయనకు చెందిన ఈ వీడియోను మాండ్యాలోని ప్రజలే కాదు యావత్ ప్రపంచమంతా చూస్తోంది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. మాండ్యాకు చెందిన జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్.. తన నియోజకవర్గంలోని నల్వాడీ క్రిష్ణరాజా వెడియార్ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ నాగానంద్ చెంపలు చేల్లుమనిపించారు. మాండ్యా నియోజకవర్గంలో శిధిలావస్థకు చెందిన ఈ ఐటీఐ కాలేజీకి కొత్త భవనాన్ని నిర్మించగా, దానిని ప్రారంభించేందుకు వెళ్లారు. ఇక అదే పనిలో భాగంగా ఆయన ప్రిన్సిపాల్ ను పిలిచారు.
అయితే ఎక్కడో వెనకాల ఉండటంతో కోపం తెచ్చుకున్న ఆయన.. సర్లే కానీ అంటూ.. ఐటిఔ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ డెవలప్మెంట్ వర్క్ గురించి అడిగారు. అయితే ప్రశ్నలు దాటవేత ధోరణితో ప్రిన్సిపాల్ సమాధానం ఇవ్వడంతో ఆయనకు కోపం వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే.. ప్రిన్సిపల్‌పై చేయి చేసుకున్నారు. పదేపదే ఆయన్ను కొడుతూ కనిపించారు. ఈ ఘటన జూన్ 20వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రిన్సిపాల్‌ను ఎమ్మెల్యే కొడుతున్న సమయంలో అక్కడున్నవారంతా నిశ్చేష్టులయ్యారు.
JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone
— Sheetal Chopra (@SheetalPronamo) June 21, 2022
This happens when power goes to head
Shamepic.twitter.com/8RTCCud8Mo
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more