Man thrashed for kissing wife in Sarayu river భార్యకు ముద్దుపెడితే.. చెంప చెల్లుమంది.. ఎందకో తెలుసా.?

Viral video man attacked for kissing wife in ayodhya s sarayu river cops say probe underway

Husband, Wife, Kissing, mob thrashed husband, Husband thrashed for kissing wife in sarayu river, moral policing in sarayu river, Ayodhya Police, Kotwali police station, Ayodhya Police tweet, Ayodhya, Sarayu River, Social Media, Uttar Pradesh Crime, Viral Video

A group of youth abused and attacked a man for allegedly kissing his wife in public and now the video is going viral on the internet. The incident took place at Ram Ki Paidi, one of the ghats on the bank of Sarayu river in Ayodhya, Uttar Pradesh. The people on the spot recorded the entire incident through their mobile cameras and now the video is doing rounds on the internet.

ITEMVIDEOS: భార్యకు ముద్దుపెడితే.. చెంప చెల్లుమంది.. ఎందకో తెలుసా.?

Posted: 06/23/2022 01:25 PM IST
Viral video man attacked for kissing wife in ayodhya s sarayu river cops say probe underway

ఇద్దరు కొత్తగా పెళ్లైన భార్యభర్తలు. విహారంతో పాటు దైవానుగ్రహం పోందేలా ప్లాన్ చేసుకుని అయోధ్య నగరానికి చేరుకున్నారు. ఇక నదిలో పవిత్రస్నానం చేస్తున్నాడు. ఈలోగా తన ఎదుట ఉన్న భార్యను చూసి.. దగ్గరకు తీసుకుని కళ్లు మూసుకుని ముద్దుపెట్టాడు. అంతే అతని చెంప చెల్లుమనింది. అదేంటి తన భార్యకేగా తాను ముద్దుపెట్టిందీ.? మరీ ఈ వడ్డన ఎక్కడిదంటూ ఆశ్చర్యపోయాడు. తీరా తన చుట్టూ చూస్తే పదుల సంఖ్యలో ఉన్న యువకులు అతనిపై దాడి చేశారు. ‘‘నా భార్యను నేను ముద్దుపెట్టుకుంటే మీకు వచ్చిన అభ్యంతరమేంటి.?’’ అని అనుకన్నాడే.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కొ్త్తగా పెళ్లన జంట ఎక్కడి నుంచో అయోధ్యలోని రామజన్మభూమిని వీక్షించేందుకు వచ్చారు. అయితే రాములవారి అనుగ్రహం పోందేముందు నదీస్నానం చేయాలని అనుకున్నారు కాబోలు. సమీపంలోని సరయు నదిలో ఇద్దూ కలసి జంటగా స్నానం చేస్తున్నారు. ఈక్రమంలో తన ఎదుట ఉన్న భార్య తడిసిన వేళ.. మరింత అందంగా కనిపించడంతో.. ఆగలేక ముద్దుపెట్టాడు. ఆ వెంటనే అమె కూడా తన భర్తకు ముద్గు పెట్టబోయింది. దీంతో అదే నదిలో సాన్నాలు ఆచరిస్తున్న మరికొందరు స్థానికులు వారిని అడ్డుకున్నారు.

వారిని నది నుంచి బయటకు తీసుకువచ్చిన భర్తపై దాడి చేసి చితకబాదారు. అయోధ్యలో ఇలాంటి వాటిని సహించబోమంటూ మూకుమ్మడిగా దాడిచేశారు. నది నుంచి బయటకు లాక్కుంటూ దాడి చేశారు. భార్య అడ్డం పడుతున్నా ఆగలేదు సరికదా, తిడుతూ అతడిని కొడుతూనే ఉన్నారు. ఓ వ్యక్తి మాత్రం వారిని అడ్డుకుని ఆ జంటను బయటకు పంపాడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అది తిరిగి తిరిగి పోలీసుల దృష్టిలో పడడంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles