మానవ అవయవాల్లో గుండె చాలా ప్రధానమైంది. మావన దేహంలోని రక్తాన్ని శుద్ది చేసిన తిరిగి దేహంలోని అన్ని అవయవాలకు పంపుతుంది. ఈ కాలక్రమంలో గుండెకు చేరే రక్తం చిక్కబడినా.. లేక గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు చేరి రక్తం సరిగ్గా సరఫరా కాకుండా చేసినా.. వాటి వల్ల తీవ్రమైన అనారోగ్యం ఏర్పడవచ్చు. ఒక్క సమయంలో అకస్మిక మరణాలు కూడా సంభవించవచ్చు. దానినే గుండెపోటు అని కూడా అంటాం. అందుకనే గుండెను చాలా అరోగ్యంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
ఇక గుండె అరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రోజుకు కనీసం 45 నిమిషాల పాటు నడక తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఇక గుండెకు ఏదైనా జబ్బు వస్తే ఆ తర్వాత జీవితం అంతా గాజుబొమ్మలాగే బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గుండెకు ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మిగిలిన జీవితం అంతా సున్నితంగా మార్చేసుకోవాలి. అయితే ఈ రకమైన పరిస్థితులు ఇకపై తలెత్తవు. మరీ ముఖ్యంగా గుండెపోటు వచ్చిన తరువాత గుండె ఒడిదోడుకులకు గురువుతుందని.. ఈ క్రమంలో కొన్ని కణాలు కూడా దెబ్బతింటాయని.. కార్డియో సర్జన్లు చెబుతుంటారు.
అందుచేత గుండె నాళాలు బ్లాక్ అయినా.. లేక గుండెపోటు వచ్చిన రోగులు శస్త్రచికిత్స తరువాత తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని వైద్యులు చెబుతుంటారు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనతో ఈ పరిస్థితి మారనుంది. గుండెను రిపేర్ చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గుండెను రిపేరు చేయడంతో పాటు రీజనరేట్ ప్రక్రియను వేగవంతం చేసే టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కు చెందిన పరిశోధకులు కనుగోన్నారు. సింథటిక్ మెసెంజర్ రిబోన్యూక్లియక్ యాసిడ్ (ఎంఆర్ఎన్ఏ) ద్వారా ఒక ఎలుక హృదయంలోకి కొన్ని మ్యుటేట్ అయిన ట్రాన్స్క్రిప్షన్ కారకాలను పంపారు.
ఇవి డీఎన్ఏ.. ఆర్ఎన్ఏగా మారే ప్రక్రియను కంట్రోల్ చేసే ప్రొటీన్లు. ఇలా మ్యుటేట్ చేసిన స్టెమిన్, వైఏపీ5ఎస్ఏ కారకాలు కలిసి హృదయంలోని కణాలు వేగంగా రెట్టింపు అవడానికి దోహదపడతాయి. దీంతో గుండె వేగంగా రిపేర్ అవుతుంది. తాము పంపే ఈ కారకాల వల్ల హృదయం రిపేర్ అయ్యే వేగం చాలా రెట్లు పెరుగుతోందని చెప్పిన శాస్త్రవేత్తలు.. కేవలం 24 గంటల్లోనే 15 రెట్ల వేగాన్ని పరిశీలించినట్లు చెప్పారు. మరో పరిశోధనలో హృదయంలో దెబ్బతిన్న ప్రాంతాన్ని ఈ కారకాలు రిపేర్ చేయడాన్ని కూడా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more