రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించిన వ్యక్తి.. పదవి పోయినంత మాత్రాన ఆయనను సోంత పార్టీ నేతలే పరాభవించారు. పార్టీ నేతలు అందులోనూ జనరల్ కౌన్సిల్ సభ్యులు మాత్రమే హాజరైన కార్యక్రమంలో ఆయనకు ఈ చేధు అనుభవం ఎదురైంది. దీంతో ఆయన పార్టీ కార్యక్రమం మధ్యలోంచే వాకౌట్ చేస్తూ వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఆయన మద్దతుదారులు కూడా వెంటవెళ్లారు. ఇలా వెళ్తున్నవారిపై సొంత పార్టీ నేతలే ఖాళీ వాటర్ బాటిళ్లను విసరడం అత్యంత విచారకరం. అసలింతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందీ.? ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరు అనేగా మీ సందేహం.
ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంకు ఈ పరిస్థితి ఎదురైంది. అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత మరణానంతరం మరోమారు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల పాటు పగ్గాలను చేపట్టిన ఆయనను అప్పుడు పార్టీలో నెంబర్ 2గా చక్రంతిప్పిన శశికళ పదవీచుత్యుడిని చేసింది. పార్టీ సహా ముఖ్యమంత్రి పగ్గాలను అందుకోవాలని పావులను కదిపింది. అందుకు తగ్గట్టుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఎడపాటి పళనిసామికి చెందిన గొల్డన్ బీచ్ రిసార్టులో పెట్టి క్యాంపు రాజకీయాలను నడిపింది. అయితే అదే సమయంలో అమెపై నమోదైన అక్రమాస్థుల కేసులో అమెకు జైలు శిక్షపడింది.
దీంతో సీఎం కావాలన్న ఆశలు అడియాశలు కాగా, అమె అధికార రాజకీయ ప్రవేశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తమిళనాడులో శశికళ తన వర్గానికి చెందిన పళనిసామి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించింది. కాగా కేంద్రం మద్దతు మాత్రం పన్నిరు సెల్వంకు ఉంది. దీంతో వీరిద్దరి మధ్య అప్పుడు రాజకున్న రాజకీయ వైరం ఇప్పటికీ రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. పార్టీలో ఇద్దరు కీలక సభ్యులు కాబట్టి ఇద్దరి అమోదంతో మాత్రమే అన్ని కార్యక్రమాలు ముందుకుసాగాలని కేంద్రం వీరిద్దరి మధ్య అప్పట్లో రాజీ కుదిర్చింది. అయితే అధికారం పోయిన తరువాత ఇప్పుడు పార్టీ ఒక్కరి అధినాయకత్వంలోనే నడవాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నెల 14న నిర్వహించిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఈ మేరకు జిల్లాల నాయకత్వం కోరింది. దీంతో ఈ విషయమై పార్టీ సాధరణ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా ఈనెల 23న పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని పార్టీ నిర్ణయించింది. దీంతో రెండు రోజలు క్రితం పన్నీరు సెల్వం వర్గం ఈ సవావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. అందుకు పళనిస్వామి వర్గం అంగీకరించలేదు. చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేయాలని చెప్పడం.. కౌన్సిల్ సభ్యులను తప్పుదారి పట్టించడమే అవుతుందని పేర్కోంది. దీంతో గత్యంతర లేని పరిస్థితుల్లో ఇవాళ సమావేశాన్ని నిర్వహించారు.
#WATCH | Tamil Nadu: Bottles hurled at AIADMK coordinator and former Deputy CM O Panneerselvam at the party's General Council Meeting today. The meeting took place at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram in Chennai.
— ANI (@ANI) June 23, 2022
He walked out halfway through the meeting. pic.twitter.com/lVb1AdvAGt
పార్టీలో చేపట్టే ఎలాంటి కార్యాలు, కార్యక్రమాలైన ఈ కౌన్సిల్ సమావేశం అమోదం మేరకే నిర్వహిస్తోంది. ఇక అన్నాడీఎంకే పార్టీలో 2600 మంది సభ్యులు కౌన్సీల్ సభ్యులు ఉన్నారు. వీరి అమోదం మేరకే తాజగా అన్నాడీఎంకే పార్టీలో ఏక వ్యక్తి నాయకత్వంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిఉంది. ఇవాళ జరిగిన సమావేశంలో పార్టీ కో-ఆర్డినేటర్ గా ఉన్న పన్నీరు సెల్వం వర్గానికి వ్యతిరేకంగా కౌన్సిల్ సభ్యులు నినాదాలు చేయడంతో రసకందాయంగా మారింది. కాగా ఎలాంటి తీర్మాణాలను అమోదించకుండానే జనరల్ కౌన్సిల్ సమావేశం అర్థాంతరంగా ముగిసింది.
తమకు వ్యతిరేకంగా కౌన్సీల్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును చూసిన పన్నీరుసెల్వం సహా ఆయన వర్గం సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేస్తూ మధ్యలోనే బయటకు వచ్చాయి. పన్నీరు సెల్వంతో పాటు అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్ వైధ్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడి ప్రభాకర్ సహా పలువురు కౌన్సిల్ సభ్యులు కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇలా వారు వెళ్తున్న క్రమంలో పళనిస్వామి వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేతలు వారిపై ఖాళీ వాటర్ బాటిళ్లను విసిరారు. ఇక ఈ సమావేశంలో 23 తీర్మాణాలను ప్రతిపాదించాలని భావించగా అది కాస్తా వాయిదాపడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more