"Come arrest me," Sanjay Raut on ED Notices 2007 నాటి భూకుంభకోణం కేసులో ఈడీ నోటీసులు

Ed summons shiv sena s sanjay raut come arrest me he responds on twitter

Sanjay Raut, ED, Sanjay Raut notice, ED notice to Sanjay Raut, Sena vs Sena, Shiv Sena news, Shiv Sena latest, Uddhav government news, uddhav news, Uddhav thackeray news, Sanjay Raut, ED, Land Encroachment case, Maharashtra Political crisis, Uddhav Thackeray, Eknath Shinde, Maharashtra, Politics

The Enforcement Directorate (ED) on Monday summoned Shiv Sena leader and Rajya Sabha member Sanjay Raut in connection with its probe into a money laundering case over the Patra Chawl redevelopment project in Mumbai. Raut has been told to appear before ED officials on Tuesday, a senior agency official said.

సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు.. తలనరికినా గౌహతి మార్గానికి రానన్న నేత

Posted: 06/27/2022 03:51 PM IST
Ed summons shiv sena s sanjay raut come arrest me he responds on twitter

మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం నేప‌థ్యంలో సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే స‌న్నిహితుడు, ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు భూ కుంభ‌కోణంలో ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. ప్ర‌వీణ రౌత్‌, ప‌త్రా చావ‌ల్ ల్యాండ్ స్కాం కేసులో ఈడీ సంజ‌య్ రౌత్‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సంజ‌య్ రౌత్‌కు చెందిన ఆస్తులు కొన్నింటినీ ఈడీ అటాచ్ చేసింది. రౌత్‌కు స‌మన్లు జారీ చేయ‌డం ద్వారా ఈడీ కాషాయ పార్టీ ప‌ట్ల స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించింద‌ని శివ‌సేన నేత ప్రియాంక చ‌తుర్వేది ఆరోపించారు. మ‌రోవైపు రేపు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సంజ‌య్ రౌత్‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేయ‌డంపై టీఎంసీ మోదీ స‌ర్కార్‌పై విరుచుకుప‌డింది.

ప్ర‌త్య‌ర్ధుల‌ను వేధించ‌డం, విప‌క్ష స‌ర్కార్ల‌ను కూల్చివేయ‌డం వంటి వికృత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న నరేంద్ర మోదీ ఎమ‌ర్జెన్సీ చీక‌టి రోజుల గురించి మాట్లాడ‌టం సిగ్గుచేట‌ని టీఎంసీ ప్ర‌తినిధి సాకేత్ గోఖ‌లే విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇక‌ మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉద్థవ్ ఠాక్రే ప్ర‌భుత్వం నుంచి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 38 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఎంవీఏ ప్ర‌భుత్వం మైనార్టీలో ప‌డింద‌ని షిండే వ‌ర్గం సోమ‌వారం పేర్కొంది. డిప్యూటీ స్పీక‌ర్ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న‌ద‌ని ఆరోపించింది.

మ‌రోవైపు రాజ్ ఠాక్రేతో అస‌మ్మ‌తి నేత ఏక్‌నాథ్ షిండే ఫోన్‌లో సంప్ర‌దింపులు జ‌రిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంత‌రం త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులు వేయాల‌ని అస‌మ్మ‌తి వ‌ర్గం నిర్ణ‌యించింది. ఇక రెబెల్ గ్రూపుపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేసిన రౌత్ హిందుత్వ కోసం ఎవ‌రు ప్రాణాలు అర్పించారో త‌మ‌కు తెలుస‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ అస్ధిరత‌ నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే అసెంబ్లీని స‌మావేశ‌ప‌ర‌చాల‌ని మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా ప‌టోలె డిమాండ్ చేశారు.


ప్రవీణ్ రౌత్, పాత్ర చాల్ భూ కుంభకోణానికి సంబంధించిన ఈ 2007 నాటి కేసులో సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై సంజయ్‌ రౌత్‌ స్పందించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ముఖ్యమంత్రిగా విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ పని చేస్తున్న సమయంలో నమోదైన ఈ కేసులో.. ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. తాము బాలాసాహెబ్‌ శివసైనికులమని, ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తున్నామని, ఇది తనను అడ్డుకునే కుట్రని మండిపడ్డారు. ‘నువ్వు నా తల నరికినా.. నేను గౌహతి మార్గంలో వెళ్లను. నన్ను అరెస్ట్‌ చేయండి.. జై హింద్‌ అంటూ’ సంజయ్‌ రౌత్‌ ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles