Woman Falls From Bike After Coconut Drops On Her Head చెట్టుపై నుంచి మహిళ తలపై పడ్డ కోబ్బరికాయ..

Woman falls from bike after basketball sized coconut drops on her head

Malaysia, viral video, coconut falls on woman, coconut drops on woman, basketball-sized coconut

In a shocking incident in Malaysia, a woman narrowly escaped death when a coconut fell on her while she was sitting on the back of a two-wheeler. The incident took place in Jalan Teluk Kumbhar on Sunday and the video of the same is now going viral. However, the woman was wearing a helmet, which saved her life.

కదులుతున్న స్కూటర్‌పై వెళ్తున్న మహిళ… నేరుగా తలపై పడిన కొబ్బరికాయ

Posted: 06/28/2022 01:32 PM IST
Woman falls from bike after basketball sized coconut drops on her head

అంతా విధి లిఖితం.. ఎవరికి ఎప్పుడు ఏమి జరగాలో.. వారికి అప్పుడు అది జరిగి తీరుతుంది. చెన్నై బ్యాంకు మేనేజర్ వాణి కారు ప్రయాణం చేస్తుండగా, కారుపై చెట్టు పడిన ఘటనలో ఈ విషయాన్ని పేర్కోన్నాం. అదే మరో ఘటనలోనూ మరోమారు నిరూపితమైంది. అచ్చంగా అలాంటి ఘటనే మరోకరి జరిగింది. అయితే ఇక్కడ బాధితురాలు స్కూటర్‌పై వెనుక కూర్చొని స్నేహితురాలితో కలిసి వెళ్తోంది. ఇక దీనికి తోడు ఇక్కడ చెట్టుకు బదులు చెట్టుపై నుంచి పెద్ద కోబ్బరిబోండాం సరిగ్గా మహిళ తలపై పడింది. దీంతో ఆమె స్కూటర్‌ పైనుంచి రోడ్డుపై పడింది. ఇంతటి పెద్ద ఘటన జరిగినా సదరు మహిళకు మాత్రం పెద్దగా ప్రాణాపాయం జరగలేదు. ఎందుకంటే బాధిత మహిళ హెల్మెట్‌ ధరించింది.

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారని కాదు.. ఈ ఘటన కూడా రుజువుచేస్తోంది. ఊహించని ఈ సంఘటన మలేషియాలో జరిగింది. స్నేహితులైన ఇద్దరు మహిళలు ఆదివారం జలాన్ తెలుక్ కుంబార్‌ నుంచి జార్జ్ టౌన్‌కు స్కూటర్‌పై వెళ్తున్నారు. అయితే రోడ్డు పక్కగా ఉన్న కొబ్బరి చెట్లు రోడ్డు మీదకు ఒంగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక కొబ్బరి చెట్టు పై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళపై తలపై నేరుగా పడింది. దీంతో అదుపు తప్పిన ఆమె స్కూటర్‌ పైనుంచి రోడ్డుపై పడింది. ఆమె ధరించిన హెల్మెట్‌ కూడా కింద పడిపోయింది. స్కూటర్‌ను ఆపిన స్నేహితురాలు వెంటనే సహాయం కోసం ఆమె వద్దకు పరుగున వచ్చింది.

మరోవైపు రోడ్డుపై వెళ్తున్నవారు, స్థానికులు వెంటనే స్పందించారు. ఆ రోడ్డుపై వెళ్లే వాహనాలను అప్రమత్తం చేసి ఆపారు. గాయపడిన ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ తమన్ ఎమాస్‌కు చెందిన పువాన్ అనిత అని స్థానిక రాజకీయ నేత అజ్రుల్ మహతీర్ అజీజ్ తెలిపారు. ఈ ప్రమాదం గురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. రోడ్డు మీదకు ఒంగి ప్రమాదాలకు దారి తీసేలా ఉన్న కొబ్బరి చెట్లను నరికివేస్తామని అధికారులు హామీ ఇచ్చారని అన్నారు. కాగా, ఆ స్కూటర్‌ వెనుక వెళ్తున్న కారు డ్యాష్‌ బోర్డుపై ఉన్న కెమెరాలో రికార్డైన వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యింది.

https://www.reddit.com/r/nevertellmetheodds/comments/vl68jd/a_coconut_fell_straight_on_a_bikers_head/?utm_source=share&utm_medium=web2x&context=3

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles