అల్లూరి సీతారామరాజు సదా స్మరణీయుడని, యావత్ భారతావనికి ఆయన స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలను జాతికి వివరించడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు చెందిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. అల్లూరి జన్మించిన పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందుకు ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు ఒక్క ప్రాంతానికి చెందినది కాదని దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారని అందులో అల్లూరి సీతారామరాజు ప్రముఖుల్లో ఒకరని అన్నారు. ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆంగ్లేయులను ఎదిరించారని తెలిపారు. అల్లూరి జననం నుంచి బలిదానం వరకు చేసిన పోరాటాలు అందరికీ తెలియాలని , ఆదివాసీల శౌర్యం, ధైర్యానికీ ప్రతీక అల్లూరి అని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో యువకులు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా యువకులు భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.
తన ప్రసంగంలో ఏపీలోని ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంత్, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశ లింగం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలను కొనియాడారు. వీరుల స్వప్నాలను నెరవేర్చే బాధ్యత నయాభారత్ లో అందరిదని అన్నారు. ఆదివాసీలు తయారు చేస్తున్న 12 ఉత్పత్తులకు మాత్రమే కనీస మద్దతు ఉండగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత 90 ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీలున్న జిల్లాల అభివృద్ధికి లాభం చేకూరేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాసంస్థలను నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more