దేశ రాజధాని ఢిల్లీ నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. కరాచీ ఎయిర్ పోర్టులో దిగినప్పటికీ అక్కడ విమాన ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్ జెట్ విమానం యాజమాన్యం తెలిపింది. అయితే పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన అవసరం ఏముందన్న దానిపై ఆ విమాన సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. ఢిల్లీ నుంచి దుబాయ్ కి బయలుదేరాల్సిన విమానంలో ఇంధన ఇండికేటర్ లైట్లో సమస్యలు తలెత్తడంతో స్పైస్ జెట్ విమానం జీ 737 విమానాన్ని కరాచీకి దారి మళ్లించామని తెలిపారు.
కరాచిలో విమనాం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. విమానంలోని ప్యాసింజర్లు అందరూ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించలేదు. విమానం సాధారణంగానే ల్యాండింగ్ అయ్యింది. ఇంతవరకు ఈ విమానానికి ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ అనుకోకుండా ఇవాళ ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమాన ప్రయాణికులందరికీ రిఫ్రెష్ మెంట్స్ అందించామని, ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. మరో విమానాన్ని కరాచీకి పంపించామని.. అది అక్కడి నుంచి ప్రయాణికులను తీసుకుని దుబాయ్ కి వెళ్తోందని ఆయన చెప్పారు.
కాగా, స్పైస్ జెట్ 737జీ విమానం ట్యాంకు నుంచి అసాధారణ రీతిలో ఇంధనం తగ్గుతోందని, దీంతో ఇండికేటర్ లోపమా.? లేక ఇంధనం లీక్ అవుతోందా.? అన్న అనుమానాలు తలెత్తి.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రెక్కల భాగంలో ఉన్న ఇంధన ట్యాంక్ నుంచి లీకేజీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. అనూహ్య రీతిలో ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ అవుతున్నట్లు గుర్తించామని డీజీసీఏ అధికారులు తెలిపారు. చాలా వేగంగా ఇంధనం తగ్గిన సంకేతాలు కాక్‌పిట్‌లో ఉన్న ఫ్యూయల్ డిస్ప్లేలో కనిపించినట్లు వెల్లడించారు. దీని వల్లే విమానాన్ని కరాచీలో ముందు జాగ్రత్తగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు. విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more