జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్య చేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. జపాన్ నారా పట్టణంలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు రెండు రౌండ్ల పాటు షింజో అబేపైకి కాల్పులు జరిపారు. దీంతో షింజో అబే మరణించారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షింజో అబేకు నివాళిగా భారత్ రేపు(జూలై 9) ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం పాటించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. షింజో అబేతో తనకు ఉన్న స్నేహం గురించి ప్రధాని మోదీ ట్వీట్స్ చేశారు. ఇటీవల టోక్యో వెళ్లిన సమయంలో తన స్నేహితుడు షింజో అబేను కలుసుకున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
జపాన్- ఇండియా సంబంధాల బలోపేతానికి అబే కృషి చేశారని.. జపాన్- ఇండియా అసోసియేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడేందుకు సహకారం అందించారని ప్రధాని మోదీ గుర్తు చేస్తున్నారు. భారతదేశం ఈ కష్ట సమయంలో జపాన్ సోదర సోదరీమణులకు సంఘీభావంగా నిలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. షింజో అబే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచే తనకు షింజో అబేతో అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రధాని అయిన తర్వాత మా స్నేహం కొనసాగిందని..ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వ్యవహారాలపై ఆయన అవగాహన చాలా లోలైనదని అన్నారు.
షింజో అబే రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తాత నొబుసుకే కిషి, చినతాత ఇసాకు సాటో ఇద్దరూ దేశ ప్రధానులే. పదేళ్లపాటు దేశాన్ని ఏలారు. తండ్రి విదేశాంగ మంత్రిగా చేశారు. షింజో తాతల అడుగు జాడల్లో జాతీయవాదిగా ఎదిగారు. జపాన్ను సైనిక శక్తిగా చూడాలనుకున్నారు. ఈ క్రమంలో జపాన్‌లోని ఉదారవాదులకు, రెండో ప్రపంచ యుద్ధకాలంలో అణచివేతకు గురైన చైనా, కొరియా లాంటి పొరుగు దేశాలకు కంటగింపుగా మారారు. 2006లో 52 ఏళ్ల పిన్న వయస్సులో తొలిసారి ప్రధాని అయినపుడు భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు.
అయితే, పేగు క్యాన్సర్ రావడంతో ఏడాదిలోనే దిగిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వంలో అవినీతి కారణంగా ఐదేళ్లలో ఆరుగురు ప్రధానులు మారారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ 2012లో షింజో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 2020 వరకు ఎదురులేకుండా పాలించారు. దేశ రాజకీయాల్లో స్థిరత్వం తెచ్చారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందున్న జపాన్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని కంకణం కట్టుకున్నారు. ఆయన రాజ్యాంగాన్ని ఎందుకు పునరుద్దరించాలని భావించారన్న వివరాల్లోకి వెళ్తే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధిపత్యం కొనసాగించింది.
ఈ క్రమంలో జపాన్ మెడలు వంచి కొత్త రాజ్యాంగం రాయించిన అమెరికా జపాన్‌కు సైన్యం లేకుండా చేసింది. కేవలం శాంతి భద్రతల పరిరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది. షింజో ప్రధాని అయ్యాక సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌ను పూర్తి స్థాయి సైన్యంగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికా రాయించిన రాజ్యాంగాన్ని షింజో తాత కూడా ప్రధాని హోదాలో వ్యతిరేకించారు. అయితే, ఆయన ఎక్కువ కాలం అధికారంలో నిలబడలేక పోయారు. ఆయన కలను నెరవేర్చేలోగా మనుమడు షింజో హత్యకు గురయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more