జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) ఆసుపత్రిలో చికిత్స పోందుతూ కన్నుమూశారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిని ఆయన మృత్యువుతో పోరాడి ఓడిపోయారని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. షింజో అబే(67) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరించిన షింజో ఓ మాజీ సైనికుడి తూటాలకు బలయ్యారు. దక్షిణ జపాన్‌లోని నారా నగరంలో రైల్వే స్టేషన్ వెలుపల ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది.
వెనుక నుంచి వచ్చిన మాజీ సైనికుడు నాటు తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పిడికిలి పైకెత్తి మాట్లాడుతున్న షింజో అబే మెడలో ఒక తూటా, గుండెలో మరో తూటా వెంట వెంటనే దూసుకుపోయాయి. వెంటనే ఆయన ఛాతి పట్టుకొని కుప్పకూలిపోయారు. తెల్లటి చొక్కా ఎర్రటి రక్తంతో తడిసిపోవడంతో ఆయనపై కాల్పులు జరిగిన విషయం చుట్టుపక్కల వారికి అర్థమైంది. అప్పటికప్పుడు హెలికాప్టర్‌పై ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే షింజో తుది శ్వాస విడించారు. షింజో మరణం ప్రపంచ దేశాలను దిగ్ర్భాంతికి గురిచేసింది.
రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి ఆయన వైదొలగినప్పటికీ ఇప్పటికీ జపాన్ రాజకీయాలను శాసించే అత్యున్నత నేతగా వెలుగొందుతున్నారు. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం (9 ఏళ్లు) ప్రధానిగా కొనసాగిన ఘనత కూడా ఆయనదే. కాగా, కాల్పులు జరిపిన మాజీ సైనికుడి తెట్సుయా యమగామి(41). నారా పట్టణానికి చెందిన వాడే. జపాన్ నావికా దళంలో 2002 నుంచి 2005 వరకు మూడేళ్ల పాటు పని చేశాడు. అతడిని సంఘటన స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద డబుల్ బ్యారెల్ షాట్ గన్ను స్వాధీనం చేసుకున్నారు.
త్రీడీ ప్రింటింగ్ పద్ధతిలో హంతకుడే స్వయంగా గన్ను తయారు చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. హంతకుడు షింజో వెనుక నిలబడి కేవలం పది అడుగుల దూరం నుంచి కాల్పులు జరిపాడు. రెండో బుల్లెట్ గుండెకు తగలగానే షింజో పడిపోయారు. హంతకుడు పారిపోయేందుకు ప్రయత్నం చేయలేదు. చంపడానికే కాల్చానని చెప్పాడు. హంతకుడి ఉద్దేశమేంటో, ఎందుకు చంపాడో ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. షింజో పట్ల అసంతృప్తి ఉందని మాత్రమే చెప్పాడు. అతని ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు పేలుడు పదార్థాలు లభించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more