రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం జరగనుందా? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపి.. పక్కాగా పావులు కదపుతుందా? పశ్చిమ బెంగాల్ లో రచించిన వ్యూహాన్నే తెలంగాణలోనూ అమలు చేయాలన్న యోచన చేస్తోందా.? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దెబ్బకొట్టేలా వ్యూహరచన చేసే పనిలో పడింది కమలదళం. ఇందులో భాగంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఈటలను అస్తంగా ఉపయోగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇవాళ పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని ముందే చెప్పానని... క్షేత్రస్థాయిలో సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఓడిపోతేనే తెలంగాణకు పట్టిన శని వదులుతుందని అన్నారు. బెంగాల్ లో తరహాలో సువేందు అధికారి దృశ్యం తెలంగాణలో పునరావృతం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో టీఆఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు.
ఆదివాసీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2014, 2018 టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలలో అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదం పరిష్కరించి యజమాన్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారని కానీ అది ఇప్పటివరకు అమలుకాలేదని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల భూములను టీఆర్ఎస్ సర్కార్ సేకరిస్తోందని ఈటల ఆరోపించారు. ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకే గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు. అసైన్డ్ భూముల విషయంలో దళితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.
పోడు భూముల అంశంలో సర్కార్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఓడించేందుకు అన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయని అన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధరణి పేరుతో ఇంకా కాలయాపన చేస్తే సహించేది లేదన్నారు. నిజానికి ఈటల రాజేందర్ గజ్వేల్లో తన నెట్ వర్క్ పెంచుకున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గజ్వేల్లో టీఆర్ఎస్ పతనం లక్ష్యంగా ఈటల రాజేందర్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎర్రవల్లి సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్లోని బావిలో కూలీకి వెళ్లిన ఓ యువకుడి పడి మృతి చెందిన విషయం తెలిసిందే.
విషయం తెలుసుకున్న రాజేందర్ వరదరాజ్పూర్లోని మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల మనోహరాబాద్ మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో ఈటల సమక్షంలో టీఆర్ఎస్లో కూడా చేరారు. గజ్వేల్ నియోకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులతో కూడా ఈటల చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈటల గజ్వేల్ స్థానంపై ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో గజ్వేల్ రాజకీయం... మరింత రసవత్తరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more