జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్య చేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. జపాన్ నారా పట్టణంలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు రెండు రౌండ్ల పాటు షింజో అబేపైకి కాల్పులు జరిపారు. దీంతో షింజో అబే మరణించారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అంతేకాదు ఇవాళ ఆయన మరణానికి నివాళిని గటిస్తూ జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి నివాళిగా శనివారం దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలపై జాతీయ జెండాలను సగం వరకు కిందకు దించారు. అబే మృతికి నివాళిగా భారత్‌లో శనివారం రోజు సంతాపం దినం పాటించనున్నట్లు శుక్రవారం ట్విటర్ వేదికగా మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అబే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ సంతాపం తెలిపారు. జపాన్ కోసం అబే తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. 2021లో కేంద్ర ప్రభుత్వం అబెకు భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. భారత్‌లో ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు రావటంలో షింజో అబే కీలక పాత్ర పోషించారు. జపాన్ సాంకేతికతతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ, అబె కలిసే శంకుస్థాపన చేశారు. ‘మై ఫ్రెండ్, అబే సాన్’ అనే శీర్షికతో ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రధాని మోడీ ఇలా రాశారు. “అబే మరణంతో, జపాన్, ప్రపంచం ఒక గొప్ప దూరదృష్టిని కోల్పోయింది. నేను ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను” అని రాసుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more