Two terrorists killed in Awantipora encounter: police జేఈఎం కమాండర్‌ ఖైజర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

2 terrorists killed in encounter in kashmir s awantipora arms recovered

2 terrorists killed in encounter in Kashmir's Awantipora; arms recovered, Jammu and Kashmir, kashmir police, wandakpora, awantipora, Encounter, Jaish-e-Mohammed, terrorist

Two alleged terrorists were gunned down during an encounter on Monday, July 11, in Jammu & Kashmir’s Awantipora. The encounter took place at the Wandakpora area of south Kashmir's Pulwama district. One of the terrorists was identified as Kaiser Koka. Police said the identity of another terrorist involved in the shootout is being confirmed.

కాశ్మీర్ లో జైషే మహ్మద్ కమాండర్‌ ఖైజర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

Posted: 07/11/2022 05:28 PM IST
2 terrorists killed in encounter in kashmir s awantipora arms recovered

జమ్మూకశ్మీర్‌లోని అవంతిపొరలో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు జైషే మహ్మద్ కు చెందిన కమాండర్ ను భద్రతా బలగాలు తుదముట్టించాయి. అవంతిపురలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన ముష్కరులను.. ప్రతిదాడులు జరిపిన భారత బలగాల కాల్పుల్లో వారు మరణించారు. అవంతిపుర ప్రాంతంలో ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఇప్పటికీ బలగాలు అక్కడ కార్డన్ సర్చ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

ఇద్దరిలో ఓ ఉగ్రవాదిని జైషే మహ్మద్‌ కమాండర్‌ ఖైజర్‌ కోకాగా గుర్తించారు. మరో ఉగ్రవాదిని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. కోకా 2018 నుంచి దక్షిణ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడని పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల గురించి పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 6న లష్కరే తోయిబాకు (LeT)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఉగ్రవాదులు ఖైమోలోని రెషిపురాకు చెందిన నదీమ్‌ అబ్బాస్‌ భట్‌, మిర్పురా నివాసి కఫీల్‌ మీర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  kashmir police  wandakpora  awantipora  Encounter  Jaish-e-Mohammed  terrorist  

Other Articles