తెలుగు రాష్ట్రాలలో వరుణుడి బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో చెరువులు, నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లతున్నాయి. అయితే ఈ వరుణుడి ధాటికి తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించింది. పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కూడా అందకుండాపోయింది. దీంతోనే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా, మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది భారత వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బలపడిందని... దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో మరిన్ని వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తం చేసింది.
ఇప్పటికే ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగింది. దీనికి తోడు ఒడిశా-ఏపీ కోస్తాపై మరో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతున్నది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు వెళ్లింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం అల్లూరి జిల్లాలో 1.2, ముంచంగిపుట్టు మండలం బోరంగులో 5.3, అరకులోయ, పాడేరు, చింతూరు, హుకుంపేటలో 3 నుంచి 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉన్నది. వరద ప్రభావిత జిల్లాల అధికారులను ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ అప్రమత్తం చేసింది. వరద పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరదల నేపథ్యంలో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ముందస్తు అత్యవసర సహాయక చర్యల కోసం 2 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సహాయక చర్యల్లో అధికారులతో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రకాశం బరాజ్ ఎగువ నుంచి కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో బరాజ్ గేట్లను ఎత్తివేశారు. వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదిలో పడవలు, మోటారు పడవలు, స్టీమర్లు ప్రయాణించరాదని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈత కొట్టడం, చేపలు పట్టడం, స్నానం చేయడం వంటివి చేయకూడదని సూచించారు. ఇక ఇటు తెలంగాణలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు తాజాగా.. మరో ఆరుగేట్ల ఎత్తివేశారు. ప్రస్తుతం 26 గేట్లను ఎత్తి దిగువకు 1,07,118 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087.50 అడుగుల మేర నీరున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74.826 టీఎంసీలు నిలువ ఉన్నది.
భద్రాచలం వద్ద అక్రమంగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ఉదయం గంటలకు 52.9 అడుగుల వద్ద నీరు ప్రవహించింది. ప్రస్తుతం అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించగా.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. గోదావరిలో 14,21,034 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. వరద కారణంగా భద్రాచలం రామాలయం పడమరమెట్ల వద్దకు వరద నీరు చేరింది. అలాగే అన్నదాన సత్రంలోకి సైతం వరద నీరు చేరింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్లమండలాలకు రాకపోకలు స్తంభించాయి. దుమ్ముగూడెం గంగోలు వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వరద నీరు చేరింది. సున్నంబట్టిలోకి వరద చేరడంతో పునరావాస కేంద్రానికి 50 కుటుంబాలను తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more