అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొద్దిరోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. వివరాల ప్రకారం.. సౌదీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన అరోపణలు చేశారు.
కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని అల్ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు.
అయితే, ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించాడు. అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్‌కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్‌ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేశాడని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more