ప్రజలు పూజలు సరిగ్గా చేయడం లేదన్న కోపంతో గత పక్షం రోజులుగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిపిస్తున్నానని.. ఇది తన బిడ్డలపై తాను ప్రదర్శించిన గొరంత కోసమేనని సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారు తెలిపారు. ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నానని... రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వెల్లడిస్తూ ఈ వ్యాక్యలు చేశారు. తన రూపాన్ని స్థిరంగా నిలపాలని కోరిన అమ్మవారు... విగ్రహ ప్రతిష్ఠ ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేయాలని పేర్కొంది. సాయంత్రం నిర్వహించనున్న ఫలహార బండ్ల ఊరేగింపుతో వేడుకలు ముగియనున్నాయి.
సికింద్రాబాద్ బోనాల జాతరలో ఇవాళ ప్రధాన కార్యక్రమైన రంగం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించి... అమ్మవారు భవిష్యవాణి పలికారు. ప్రజలు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారన్న అమ్మవారు.. అయినా తన బిడ్డలే కదా అని భరిస్తున్నానని తెలిపింది. గుడిలో పూజలు సరిగా జరిపించట్లేదన్న అమ్మవారు.. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా, భక్తిశ్రద్ధలతో జరిపించమని సూచించింది. సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నానని తెలిపిన ఆమె... స్థిరమైన రూపంలో కొలువుదీరాలని అనుకుంటున్నానని పేర్కొంది. తన రూపాన్ని స్థిరంగా నిలపాలని కోరిన మాతంగి.. దొంగలు దోచినట్టుగా నా నుంచే మీరు కాజేస్తున్నారని తెలిపింది.
ప్రజల కళ్లు తెరిపించడానికే గొరంత ఆగ్రహంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిపిస్తున్నానని పేర్కొంది. ఐనా మీరెన్ని తప్పులు చేసినా నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నానని అమ్మవారు పునరుద్ఘాటించింది. భవిష్యవాణి అనంతరం అమ్మవారి... అంబారి ఊరేగింపు వైభవంగా సాగింది. అంబారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు వైభవంగా సాగనుంది. నగరంలోని దాదాపు 40కిపైగా ప్రాంతాల నుంచి ఫలహారం బండ్లు వస్తాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
సాయంత్రం 7 గంటలకు ప్రారంభయమ్యే వేడుక వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూర్తి కానుంది. అంతకుముందు ఆదివారం తెలవారుజామునుంచే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు... బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెల్లవారు జామున 4 గంటలకే అమ్మవారికి తొలి బోనం సమర్పించగా... ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. దాదాపు 13 నుంచి 14 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ నిర్వహకులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more