మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లగా.. 13 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మందికి తీవ్రగాయాలు కాగా, స్థానికులు, రెస్క్యూ సిబ్బంది వారిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ధార్ జిల్లా ఖాల్‌ఘాట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణె బయలుదేరిన బస్సు.. వంతెనపై అదుపు తప్పి.. నేరుగా రక్షణ గోడును ఢీకోని నర్మదా నదిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మిగతావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఖాల్‌ఘాట్ వద్ద ఉన్న సంజయ్ వంతెనపైకి రాగానే బస్సు అదుపు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో వంతెన రక్షణ గోడను ఢీకొని సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి బస్సు నదిలోకి పడిపోయినట్లు వివరించారు. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు నీటిలో గల్లంతు కాగా, మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమాదఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో మాట్లాడినట్లు చెప్పారు చౌహాన్. గాలింపు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించానని సీఎం వెల్లడించారు.
ప్రమాదానికి గురైన బస్సు 10 ఏళ్లుగా సర్వీసులో ఉందని, ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా 10 రోజుల్లో ముగుస్తుందని మహారాష్ట్ర ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. నాగ్‌పుర్ రూరల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్‌లో.. 2012, జూన్ 12న బస్సు రిజిస్ట్రేషన్ జరిగింది. వాహనం సక్రమంగా ప్రయాణించడానికి అనువుగా ఉందని సూచించే సర్టిఫికెట్ గడువు ఈ జులై 27న ముగియనుందని ఆర్టీఓ పేర్కొంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రమాదానికి గురైన బస్సును చంద్రకాంత్ ఏక్నాథ్ పాటిల్ అనే డ్రైవర్ నడిపాడని, ప్రకాశ్ శ్రావణ్ చౌధరీ కండక్టర్‌గా ఉన్నారని మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more