దేశవ్యాప్తంగా క్రితంరోజున మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కేరళలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థినుల పట్ల అక్కడున్న సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. కట్టుదిట్ట ఏర్పాట్ల నడుమ పరీక్షలను నిర్వహించామని చెప్పుకుంటున్న సిబ్బంది.. విద్యార్థినుల పట్ల ఎంతో దిగజారి వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షా కేంద్రంలోనికి వస్తున్న విద్యార్థినుల లో దుస్తులు విప్పిన తర్వాతే వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థినులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొల్లాంలోని మార్తోమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో నీట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ కేంద్రంలో పరీక్షకు హాజరైన సుమారు 100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. అమ్మాయిలందరూ లో దుస్తులు విప్పాలని ఆదేశించారు. ఎగ్జామ్‌కు సమయం అవుతుండటంతో.. తప్పని పరిస్థితుల్లో విద్యార్థినులందరూ లో దుస్తులు విప్పి.. పరీక్షకు హాజరయ్యారు. అక్కడ ఓ డబ్బాలో లో దుస్తులు ఉంచిన దృశ్యాలు కనిపించాయని పరీక్ష అనంతరం విద్యార్థినులు పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సిబ్బందిని వివరణ కోరగా.. లో దుస్తులకు బెల్ట్స్ వంటి పరికరాలు ఉండటం వల్లే అలా చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. అలాగే పరీక్షా కేంద్రంలోని సాధారణ చెప్పులను మాత్రమే అనుమతించారు. ఆభరణాలు, మెటల్ వస్తువులు, ఎలాంటి వాచీలు, కెమెరాలు, టోపీ, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్‌లకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇదేం కొత్త ఘటన కాదు.. నీట్ ఎగ్జామ్ రాసే విద్యార్థినులకు ప్రతి ఏడాది ఏదో ఒక చోట ఇలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంది. 2017లో తమిళనాడులోని కన్నూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more