ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వ్యవహారంపై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేలకోట్ల రూపాయల ఆస్తులున్నాయని 2017లో ఆరోపించిన కాకాణి గోవర్థన్‌రెడ్డి.. అందుకు ఆధారాలున్నాయని పత్రాలు విడుదల చేశారు. అవి నకిలీ పత్రాలని... ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కాకాణి గోవర్థన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ప్రాపర్టీ నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి మే 13వ తేదీ రాత్రి దొంగతనానికి గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించిన హైకోర్టు... మంత్రి కాకాణితో పాటు మొత్తం 18 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కోర్టులో ఆధారాల చోరి కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్థన్ రెడ్డి, తదితరులపై నెల్లూరు కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఫోర్జరీ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రతివాదులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఏపీలోని నెల్లూరు జిల్లాకేంద్రంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగలు పడ్డారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్ స్థానిక చిన్నబజారు ఠాణాలో ఫిర్యాదు చేశారు. 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్13వ తేదీ అర్ధరాత్రి కొందరు అగంతకులు చొరబడి.. కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more