ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉద్యోగుల జీపీఎఫ్ మాయం అంశంపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణ సందర్బంగా.. న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీపీఎఫ్ సొమ్మును ఎందుకు ఉపసంహరించారని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగులకు కనీస సమాచారం లేకుండా వారి అకౌంట్ల నుంచి డబ్బును ఎలా ఉపసంహరిస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వానికి తెలియకుండా ఉద్యోగులు ప్రజాధనాన్ని ఉపసంహరిస్తే.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. అదే పని ఇప్పుడు ఉద్యోగులు చేస్తే.? పరిస్థితి ఏమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సాంకేతిక తప్పిదం వల్లే జరిగిందని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి బదులివ్వగా.. ప్రతీసారి ఇలాగే చెబితే ఓ చార్టెడ్ అకౌంటెంటును అడ్వకేట్ కమిషనర్గా నియమించాల్సి వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వానికి అవసరమై 2 వేల కోట్ల రూపాయలు వాడుకున్నారన్న హైకోర్టు.. ఎప్పుడు జమ చేస్తారని ప్రశ్నించింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై కిందిస్థాయి అధికారితో అఫిడవిట్ వేయించడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది రవితేజ కోర్టుకు నివేదించగా.. సమయాభావంతో అలా జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇకపై ప్రిన్సిపల్ సెక్రటరీ అఫిడవిట్ దాఖలు చేస్తారని సమాధానమిచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటీషన్లపై ఎవరు అఫిడవిట్ దాఖలు చేసినా.. ప్రభుత్వ కార్యదర్శే బాధ్యులు అవుతారని తెలిపిన న్యాయస్థానం.. నగదు ఎప్పుడు జమ చేస్తారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది. జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ముల ఉపసంహరణపై గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more