రోజుకు 24 గంటల సమయం ఇచ్చినా సరిపోని పనిబారంతో నిత్యం బిజిబిజీగా గడుపుతున్న నేటి తరం యువత, మధ్యవయస్కులు తమ తల్లిదండ్రులను చూసుకునే వీలు లేక వారిని వృద్దాశ్రమాలలో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు. నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ విష సంస్కృతి తాజాగా పట్టణాలకు కూడా పాకింది. దీంతో వయస్సు పైబడిన తల్లిదండ్రులు వారికి భారం అవతున్నారు. తమ ఆనందాలకు వారు అడ్డంకిగా మారుతున్నారు అనుకునే వారు.. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ కు చెందిన ఈ కలియుగ శ్రావణుడి గురించి తెలుసుకోవాల్సిందే.
కలియుగ శ్రవణుడు ఏంటీ..? అసలు శ్రవణుడు అంటే ఎవరు అన్న ప్రశ్నలు మనలో చాలామందిలో తలెత్తుతాయి. రామాయణం విన్న వారికి, చదివిన వారికి శ్రవణ కుమారుడు గురించి, అతడి గొప్పతనం గురించి తెలిసే ఉంటుంది. అంధులైన తల్లిదండ్రులను పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లేందుకు వారిని కావడిలో కూర్చోబె్ట్టి.. తన భుజాలపై మోసుకెళ్తాడు. అయితే అయోధ్య రాజ్య సమీపంలో సరయు నది చెంతకు రాగానే తన తల్లిదండ్రులు దాహంగా ఉందిన చెప్పడంతో.. సరయు నది వద్దకు వెళ్లి నీటిని తీసుకువచ్చేందుకు వెళ్తాడు. నదిని సమీపించి నీటిని తీసుకువస్తుండగా, దశరథ మహారాజు ఆయనను జంతువుగా భావించి.. బాణం వదలగా అతను మరణిస్తాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వికాస్ గహ్లోత్‌ను చూసిన వారు ఇప్పుడు ‘కలియుగ శ్రవణుడు’ అని కీర్తిస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులు కావడి యాత్ర చేయాలని బావించగా వారి ఆశను ఆయన వారితో పూర్తి చేయించాడు. ఇలా వారి కావడి యాత్ర ఆకాంక్షను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఎండ, వానను లెక్కచేయకుండా తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. కావడి యాత్ర చేయాలని ఉందని తల్లిదండ్రులు చెప్పగానే మరోమాటకు తావులేకుండా సరేనన్న వికాస్.. వారితో కలిసి హరిద్వార్ చేరుకున్నాడు.
గంగానదిలో స్నానమాచరించి పవిత్ర జలాన్ని సేకరించాడు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన కావడిలో తల్లిదండ్రులను కూర్చోబెట్టి 200 కిలోమీటర్ల దూరంలోని ఘజియాబాద్‌కు బయలుదేరాడు. గంగాజలం నింపిన 20 లీటర్ల డబ్బాను తండ్రి వద్ద ఉంచాడు. ఆపై తన కష్టాన్ని తల్లిదండ్రులు చూడకుండా ఉండేందుకు వారి కళ్లకు గంతలు కట్టాడు. ఈ నెల 17న వికాస్ యాత్ర ప్రారంభమైంది. అతడికి అండగా ఇద్దరు స్నేహితులు కూడా వెంట నడిచారు. ఈ యాత్ర మీరట్ చేరుకుంది. అక్కడ స్థానిక జిల్లా పంచాయతీ అధ్యక్షుడు గౌరవ్ చౌదరి వారిని సన్మానించారు. తల్లిదండ్రుల కావడి యాత్ర కోరికను తీరుస్తున్న వికాస్‌ను అభినందించారు. అభినవ శ్రవణుడంటూ కొనియాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more