కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఈ క్రమంలో అదే బోజనం కలుషితమైతే.. ఆ అనుభవం కడు దయనీయం. కడుపులో ఆకలి నకనకలాడుతుంటే.. ఏదో ఒకటి తినాలని అందరూ అనుకుంటారు. తీరా ఇలా వచ్చిన బోజనంలో దాదాపుగా మూడోంతుల భోజనం చేసిన తరువాత అందులో విషతుల్యమైందని తెలిస్తేనే.. తిన్న ఆహారాన్ని బయటకు కక్కేసి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తాం. అయితే ఇది ప్రమాదకరమే అయినా.. ఆ పరిస్థితుల్లో తప్పదు. అలాంటిది అన్నంలో ఏకంగా పాము తల కనిపిస్తే.. దానిని తిన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు.
అదృష్టం కొద్ది దానిని తిన్న వ్యక్తికి ఏమీ కాలేదు. ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది ఓ ప్రముఖ విమానయాన సంస్థ అందించే బోజనంలో అని తెలిస్తే.. మీరెలా ఫీలవుతారు.. వెంటనే ఫ్లైయిట్ సిబ్బందితో గొడవకు దిగడం ఖాయం. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకునేందుకు అసలేం జరిగిందన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. టర్కీకి చెందిన విమానయాన సంస్థ ఫ్లైట్ అటెండెంట్ ఇటీవల విమానంలో భోజనం చేస్తుండగా పాము తల కనిపించింది. భోజనం సగం పూర్తి చేశాక పాము తలను చూసిన అటెండెంట్ భయపడిపోయాడు. ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అనంతరం ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జూలై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్కు వెళ్తున్న సన్ ఎక్స్‌ప్రెస్ విమానంలో ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. క్యాబిన్ సిబ్బంది భోజనం చేస్తున్నారు. ఒక అటెండెంట్ భోజనం సగం పూర్తిచేశాక బంగాళదుంపలు, కూరగాయల మధ్య తెగిపడిన పాము తల కనిపించింది. ట్విటర్లో షేర్ చేసిన ఫుడ్ ట్రే మధ్యలో పాము తల స్పష్టంగా కనిపిస్తున్నది. కాగా, ఈ ఘటనపై విమానయాన సంస్థ స్పందించింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఆహారం సరఫరా చేపే క్యాటరింగ్ సంస్థతో ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టింది.
Severed snake head found in a Sunexpress in-flight meal.
— Handy Joe (@DidThatHurt2) July 26, 2022
The flight was enroute to Düsseldorf from Ankara when a cabin crew member, who had eaten most of the meal, found it.
Dead snails have previously appeared in the airline’s flight meals.
A company providing catering suspended pic.twitter.com/nAgg2wSUIK
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more