చెక్కముక్కలతో చేసిన యంత్రం నీటి సాయంతో చేస్తున్న పనితీరును ప్రశంసించారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. అంతేకాదు ఆయన మదిని దోచుకున్న ఈ మెకానికల్ పరికరం పనిచేస్తున్న తీరును తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఆయన.. తన సంస్థకు చెందిన విషయాలతో పాటు తన మదిని తాకిన అద్భుత వీడియోలను కూడా నిత్యం తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన ప్రాచీన కాలంలో అప్పటి మనుషులు వినియోగించిన యాంత్ర సాంకేతికను అభిమానులతో పంచుకున్నారు.
ప్రాచీన కాలంలో, టెక్నాలజీ లేని రోజుల్లో ఈ తరహా యంత్రాలు మనుషుల అవసరాలను ఎలా తీర్చాయన్నది వీడియోను చూస్తే అర్థమవుతోంది. వేగంగా ప్రవహించే చిన్న కాలువలోని నీటి ప్రవాహ మార్గానికి అడ్డంగా చెక్కతో చేసిన చక్రాన్ని పెట్టారు. నీటి ప్రవాహ ఒత్తిడికి ఆ చక్రం తిరుగుతుంది. చక్రానికి మరోవైపున ఓ చెక్క ముక్కను ఏర్పాటు చేశారు. దీని సాయంతో మహిళ బియ్యం, ఇతర ధాన్యాలను దంచి, పొడుంగా మార్చే పని చేస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా తన స్పందనను ట్వీట్ రూపంలో తెలియజేశారు.
‘‘చుట్టూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్న కాలంలో.. ఈ ప్రాచీన మెకానికల్ పరికరం కేవలం సమర్థవంతమైనదే కాదు. ఎప్పటికీ పనిచేసేది. ఎంతో అందమైనది. కేవలం మెషిన్ కాదు. మొబైల్ శిల్పం’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ‘‘బియ్యం దంచే ఈ పరికరాన్ని ఒడిశాలో దింకి కుటా రైస్ అంటారు. ఇప్పటికీ చాలా మంది గిరిజన రైతులు దీన్నే వాడుతుంటారు’’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. తమ గ్రామంలోనూ ఇది ఉందని యూపీకి చెందిన మరో వ్యక్తి స్పందించాడు.
यह उपकरण कुशल भी है और खूबसूरत भी। In an age where we’re surrounded by electronic gadgetry, this ‘primitive’ mechanical device is not just efficient & sustainable but also stunningly beautiful. Not just a machine but a mobile sculpture… pic.twitter.com/JzhDmYriCw
— anand mahindra (@anandmahindra) July 28, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more