మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులోని నిందితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో బెయిల్ మంజూరు అయ్యింది. ఏ1 గంగిరెడ్డికి బెయిలు మంజూరు కావడంతో ఆయన బెయిలుపై బయటకు వెళ్లిడంతో తమకు కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈకేసులో నిందితులైన ఏ2, ఏ3, ఏ5 ముగ్గురు కింది కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అక్కడ కోర్టు వారి పిటీషన్లను తిరస్కరించింది. దీంతో రాష్ట్రోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. ఏ2 వై సునీల్ యాదవ్, ఏ3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు రాష్ట్రోన్నత న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం బెయిల్ పిటీషన్లను కొట్టివేసింది. దర్యాప్తు కొనసాగుతోందని, గతంలో వేసిన బెయిలు పిటిషన్లను కొట్టేశాక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని పేర్కొంది. దిగువ కోర్టులో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేయడాన్ని పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకున్నట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ బెయిలు పిటిషన్లను కొట్టేస్తూ సోమవారం కీలక తీర్పు ఇచ్చారు. ముగ్గురు నిందితుల బెయిల్ పిటీషన్లపై వాదనలు ముగియడంతో సోమవారం వారి బెయిల్ పిటీషన్లపై తీర్పును న్యాయస్థానం వెలువరించింది.
వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ హత్యకేసులో సాక్ష్యాలను మాయం చేశారని.. సాక్ష్యులను కూడా బెదిరించారని వాదనలు వినిపించారు. వివేకా గాయాలను కాంపౌండరుతో కుట్టించి.. ఆయన గుండెపోటుతో మరణించారని కూడా ప్రచారం చేశారని అన్నారు. పోస్టుమార్టం జరగకుండా తీవ్రజాప్యం చేశారని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. గతంతో తాత్కాలిక బెయిలుపై వచ్చినప్పుడే ఆయన సాక్షులను ప్రభావితం చేసేలా భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారని వాదించారు. రాజకీయ నేతలు ఆయన్ను కలిశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ముగ్గురు మిత్రులు. శివశంకర్‌రెడ్డిపై మొత్తం 31 కేసులున్నాయని తెలిపారు
సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. వివేకా మృతదేహంపై గాయాలను ఫొటో తీస్తున్న హోంగార్డును శివశంకర్ రెడ్డి బెదిరించారని వాదించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సీఐ శంకరయ్యపై ఒత్తిడి తెచ్చారన్నారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్నారు. సాక్షులను, అధికారులను బెదిరిస్తున్నారని.. హత్యానేరాన్ని మీద వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని గంగాధర్‌రెడ్డికి ఆశ చూపారన్నారు. కుట్రకోణం తేల్చేందుకు, సాక్ష్యాధారాలను నాశనం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న ఈ దశలో బెయిలు మంజూరు చేయవద్దని కోరారు. సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు టి.నిరంజన్‌రెడ్డి, కలిగినీడి చిదంబరం, టీఎల్ నయన్‌కుమార్ వాదించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more