దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ ఆఫీసుల్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇటీవల మనీల్యాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ పత్రికకు సంబంధించిన 12 ప్రదేశాల్లో ఈడీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనీల్యాండరింగ్ కేసుతో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో ఇటీవల సోనియా గాంధీని ఈడీ సుమారు వంద ప్రశ్నలు వేసిన విషయం తెలిసిందే. హెరాల్డ్ హౌజ్లో నాలుగవ అంతస్తులో ఈడీ సోదాలు చేస్తోంది. ఆ ఫ్లోర్లోనే నేషనల్ హెరాల్డ్ పబ్లికేషన్ ఆఫీసు ఉంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈడీ అధికారులు ఆఫీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలపై ఈడీ దాడుల నేపధ్యంలో కేంద్రంలోని కాషాయ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ దాడులను బూటకంగా కొట్టిపారేసిన కార్తీ చిదంబరం కేంద్రం చేతిలో ఈడీ విధ్వంస ఆయుధంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు ఏజెన్సీ బలోపేతానికి ఊతమిస్తూ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈడీ మరింత పదునుతేలిందని, కేంద్రం చేతిలో విధ్వంస ఆయుధంగా మారిందని వ్యాఖ్యానించారు. నిబంధనలను తోసిరాజేస్తూ దాడులు, సమన్లు, అరెస్టులతో చెలరేగుతున్నారని అన్నారు. ఖాతా పుస్తకాల్లో అన్ని వివరాలు లభించే పబ్లికేషన్స్ కార్యాలయాలపై దాడులు చేయడం మూర్ఖత్వమని మండిపడ్డారు.
పాలకులను మెప్పించేందుకు నేషనల్ హెరాల్డ్ కార్యాలయాలపై దాడులు చేపట్టారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వ జేబు సంస్ధగా ఈడీ మారిందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ ఉద్యోగులు, సంస్ధ సిబ్బందికి అసౌకర్యం కలిగించేందుకే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాల గొంతు నొక్కే కేంద్ర ప్రభుత్వ కుట్రలోనే భాగంగా ఈ దాడులకు తెగబడ్డారని అన్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రూ 34,615 కోట్లు నష్టపోయిందని, మెహుల్ చోక్సీ నుంచి నీరవ్ మోదీ వరకూ వేలాది కోట్లు దిగమింగారని వీటి గురించి ప్రభుత్వం ఏమైనా కలత చెందుతోందా అసలు వారిని తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారా అని మోదీ సర్కార్ను నిలదీశారు.
ధరాఘతం, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ధర్నా నిర్వహిస్తున్నారు. అక్కడే నిద్రహారాలు తీసుకుంటు కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయబడిన 24 మంది విపక్ష ఎంపీలు కూడా ఉన్నారు. దీంతో పెరుగుతున్న ధరల ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై తీవ్రంగానే పడుతుందని, దీనికి తోడు పెరుగుతున్న జీఎస్టీ స్లాబ్ లు కూడా సామాస్యులకు శరాఘాతంగా పరిణమించాయని వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఏకంగా కొన్న కోట్ల మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర సరుకుల ధరల ప్రభావం, జీఎస్టీ ప్రభావం చూపుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు పేదలుగా మారుతున్నారని వారు అక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి కాసింత బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలకు కూడా బలం పెరగనుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన అధికార రాజకీయ శక్తి బలం పెరిగినా.. తమ చక్కుచేతల్లోనే పార్టీ ఉండేలా చర్యలు తీసుకునేందుకు నేషనల్ హెరాల్డ్ అనే తేనెతుట్టను కదిపారని వార్తలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more