కాదేదీ కల్తీకి అనర్హం అన్న నానుడి ఇప్పుడు జీఎస్టీకి కూడా వ్యాపించింది. కాదేదీ జీఎస్టీకి అనర్హం అంటూ నెటిజనులు అన్ లైన్లో జోకులు పేలుస్తున్నారు. రైతు ఉత్పత్తులతో పాటు బిడ్డలకు అందించే పాలు, బెల్లం, బియ్యంపై కూడా జీఎస్టీ విధించడంతో ఈ బాదుడుపై దేశప్రజలను నుంచి తీవ్రఅసంతృప్తి వ్యక్వమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తనకు వచ్చిన జీఎస్టీ కష్టాన్ని ఏకంగా ప్రధానితో మొరపెట్టుకుంది. అదెలా అంటే ప్రధాని మోడీ ఎక్కువగా చిన్నారులతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతారని తెలుసుకున్న ఓ చిన్నారి తనకు ఎదురైన జీఎస్టీ కష్టంపై కూడా మొరాలకించాలని ఏకంగా ఓ లేఖను రాసింది.
జీఎస్టీ విధింపు కారణంగా తాను కనీసం పెన్సిల్, రబ్బర్ కూడా కొనలేకపోతున్నానని, అవి ఖరీదై పోయాయంటూ ఒకటవ తరగతి చదువుతున్న బాలిక ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అయితే ఈ లేఖ ప్రధానికి చేరిందో లేదో తెలియదు కానీ.. నెట్టింట్లో మాత్రం ఈ లేఖ విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజనులు ఈ లేఖను షేర్లు చేయడంతో.. నిత్యం సోషల్ మీడియాలో ప్రధాని యాక్టివ్ గా ఉండే ప్రధాని దీనిపై దృష్టిసారిస్తారని కూడా నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఇక కోందరు మాత్రం నిత్యవసర వస్తువులపై జీఎస్టీ స్లాబుల విధింపు ప్రధానికి తెలియకుండా జరిగే ప్రసక్తే లేదని కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఈ చిన్నారి ఎవరు.? ఏ రాష్ట్రానికి చెందినది అంటే.. స్వయంగా ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసీ పార్లమెంటరీ స్థానమున్న ఉత్తరప్రదేశ్‌కు చెందినదే. యూపీ కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన ఆరేళ్ల కీర్తి దూబే 1వ తరగతి చదువుతున్నది. ఆమె పెన్సిల్, రబ్బర్‌ను క్లాస్‌లో చోరీ చేస్తున్నారు. దీంతో కొత్త పెన్సిల్ కొనమని తల్లిని అడుగుతుండగా ఆమె మందలిస్తుంది. ఇది పరిపాటిగా మారింది. కాగా, ఆదివారం ఆ చిన్నారీ, మ్యాగీ ప్యాకెట్ కొనేందుకు ఐదు రుపాయలతో షాప్‌కు వెళ్లింది. అయితే మ్యాగీ ప్యాకెట్ ధర ఏడు రూపాయలు పెరిగినట్లు షాప్ వ్యక్తి చెప్పాడు.
దీంతో ఆ పాప నిరాశతో ఇంటికి తిరిగి వచ్చింది. కొత్త పెన్సిల్ కోసం మరోసారి మారం చేయగా తల్లి మందలించింది. టేబుల్స్ రాయమని చెబుతుంది. దీంతో తనకు జీఎస్టీ పెంపు వల్ల కలిగిన భాధను ప్రధాని మోడీకి వివరించాలని అనుకుంది. ధరల పెరుగుదలపై తాను ఎదుర్కోన్న అనుభవాన్ని ఏకంగా ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేసింది. ‘ప్రధానమంత్రీ జీ.. నా పేరు కీర్తి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మీరు ధరలు విపరీతంగా పెంచారు. నా పెన్సిల్, ఎరేజర్ కూడా ఖరీదయ్యాయి. మ్యాగీ ధర కూడా పెరిగింది. నేను పెన్సిల్ అడిగితే మా అమ్మ కొట్టింది.
నేను ఏమి చేయాలి? ఇతర విద్యార్థులు నా పెన్సిల్‌ను దొంగిలించారు’ అని హిందీలో రాసింది. మరోవైపు న్యాయవాది అయిన బాలిక తండ్రి విశాల్ దూబే, ధరల పెరుగుదలపై పాప ఆవేదనను అర్థం చేసుకున్నారు. ప్రధాని మోదీకి తన కుమార్తె రాసిన లేఖను ప్రధాని కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ చేశారు. దీంతో ఈ లేఖ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, ధరల పెరుగుదలపై విపక్షాలు పార్లమెంట్లో గళమెత్తుతూ.. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మెదీకి ఆ చిన్నారి ఈ మేరకు లేఖ రాయడం మరింత ఇబ్బందికర పరిణామంగా తయారైంది. మరీ ఈ చిన్నారి లేఖపై ప్రధాని మోడీ స్పందిస్తారో లేదో వేచిచూడాలి.!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more