Hyderabad: Marredpally SI Hurt In Knife Attack మారేడుపల్లి ఎస్ఐ వినయ్ కుమార్ పై దుండగుల కత్తిదాడి..

Another knife attack on police in hyderabad marredpally si hurt

Sub-inspector Vinay, Marredpally police station, unidentified persons, police officer attacked, second attack in Hyderabad, night duty, Om Shanti Tiffin Centre, motorcycle without a number plate, private hospital, Pawan, Sanjay, Sanjay Nagar, Langar Houz, criminal history, PD Act, Hyderabad police, Crime

Marredpally Sub-Inspector Vinay Kumar was attacked by unidentified persons on Tuesday night. Two persons attacked SI who was on night duty on Tuesday with a knife. The incident took place at around 2.50 am on August 2. Sub-inspector Vinay, who was bleeding profusely, was rushed to the nearby private hospital.

మారేడుపల్లి ఎస్ఐ వినయ్ కుమార్ పై దుండగుల కత్తిదాడి..

Posted: 08/03/2022 04:09 PM IST
Another knife attack on police in hyderabad marredpally si hurt

హైదరాబాద్ నగరంలో పోలీసులపై మరో దాడి జరిగింది. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలిస్ స్టేషన్ కానిస్టేబుల్ యాదయ్యకు కత్తిపోటు జరిగిన ఘటన జరిగి పక్షం రోజులు కూడా కాకుండానే మరోమారు పోలీసు అధికారిపై అదే తరహాలో కత్తిదాడి జరిగింది. తమ పోలిస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటూ రాత్రి వేళ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌పై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. దొంగలుగా అనుమానిస్తున్న వ్యక్తులను ఆయన నిలువరించారు.

మీరు ఎవరు అర్థరాత్రి వేళ్ల ఎక్కడి నుంచి వచ్చారు.? ఎక్కడికి వెళ్తున్నారు.? అని విచారిస్తుండగా.. అకస్మాత్తుగా ఇద్దరిలోని ఒక వ్యక్తి ఎస్ఐపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. తెల్లవారుజామున 2.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావమైన ఎస్సై వినయ్‌ కుమారును హుటాహుటిన సమీపంలోని గీత నర్సింగ్ హోమ్‌ అసుపత్రికి తరలించిన పోలీసు సిబ్బంది చికిత్స అందించారు. కడుపు భాగంలో నాలుగు, వెన్నులో నాలుగు కుట్లు వేశారు. ప్రస్తుతం ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ వినయ్ కుమార్  

ఓంశాంతి టిఫిన్ సెంటర్ ఎదురుగా నైట్‌ డ్యూటీలో ఉన్న ఎస్సై వినయ్‌కుమార్‌, మరో పోలీస్‌ అధికారి సత్యనారాయణతో కలిసి తనిఖీలు నిర్వహిన్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు నంబరు ప్లేట్ లేకుండా మోటారు సైకిల్‌తో వస్తుండం చూసి వారిని ఆపారు. ఇద్దరిని విచారిస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్ కుమార్‌పై దాడి చేశాడు. కడుపు, వెన్ను భాగంలో  పొడిచాడు. అనంతరం ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను లంగర్‌హౌస్‌లోని సంజయ్‌ నగర్‌లో నివాసముండే పవన్‌, సంజయ్‌గా గుర్తించారు. నిందితులు పీడీయాక్ట్‌ కింద జైటుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తులుగా గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles