ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. ఆ వెంటనే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 725(92.94%) ఓట్లు పోలయ్యాయి. నిజానికి పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యుల సంఖ్య 788 కాగా.. 8 ఖాళీలున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్‌కు దూరంగా ఉంది.
అయినా.. ఆ పార్టీకి చెందిన శిశిర్ కుమార్ అధికారి, దివ్యేందు అధికారి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగతా వాటిల్లో ధన్‌ఖడ్‌కు 528, యూపీఏ బలపరిచిన అభ్యర్థి మార్గరేట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధన్‌ఖడ్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది. ధన్‌ఖడ్ గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.ఫలితాలు వెలువడగానే.. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము కూడా ఆయన్ను అభినందిస్తూ.. ధన్‌ఖడ్ ఎన్నికతో దేశ ప్రజలకు లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ సీనియర్ రాహుల్ గాంధీ, యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్ అల్వా తదితరులు కూడా ధన్‌ఖడ్‌కు నేరుగా.. ట్విటర్లో అభినందనలు తెలిపారు. నిజానికి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఆశావహుల్లో గానీ, ఎన్డీయే పరిశీలనలో ఉన్న జాబితాలో గానీ, తొలుత జగదీప్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడినే మరోసారి కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుందని వార్తలు వచ్చాయి.
యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్‌ల పేర్లు కూడా ఉపరాష్ట్రపతి రేసులో వినిపించాయి. వీరెవరినీ కాకుండా జగదీప్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేయడం గమనార్హం. ‘కిసాన్ పుత్ర’ పేరుతో ఆయన్ను బరిలో దింపినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ఇలా అనూహ్యంగా బరిలో నిలిచినా.. ధన్‌ఖడ్ విజయం మాత్రం నల్లేరుపై నడకే అయ్యింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య పదవీకాలం ఈ నెల 10న ముగుస్తుంది. ఆ తర్వాతి రోజే ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more