వైసీపీ ఎంపీ గోరంట్ల మాదవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంపై టీడీపీ నేతలు విమర్శలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఈ ఘటనపై స్పందించారు. తాము తమ పార్లమెంటు సభ్యుడిని కాపాడుతున్నట్లుగా టీడీపీ నేతలు విమర్శలు సంధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తమ ఎంపీ వల్ల బాధింపబడిన మహిళకేదో అన్యాయం జరిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీటీపీ నేతలది శాడిజంతో పార్లమెంటు సభ్యుడిపై, అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారని అమె మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళా నేతలు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో గమనించుకోవాలని హితవు పలికారు. ఆ మహిళానేతలు వాడే పదజాలం రాష్ట్రంలోని మహిళలందరూ సిగ్గుపడేలా ఉందని తానేటి వనిత విమర్శించారు. ఇవాళ ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సీఎం జగన్ మూడేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉండడం ఓర్వలేక ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలకు దిగుతున్నారని ఆరోపించారు. విమర్శించడానికి ఏ కారణాలు దొరక్క ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని అన్నారు. మాధవ్ అంశంలో వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అది నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు.
మహిళలకు న్యాయం చేయడానికే తమ ప్రభుత్వం ఉందని ఆమె ఉద్ఘాటించారు. "ఈ అంశంలో మాట్లాడుతున్న టీడీపీ మహిళానేతలను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఓ మహిళా అధికారిని జుట్టు పట్టుకుని ఈడ్చి కొడితే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమెకు మీ ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు? నాడు మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి రావెల కిశోర్ బాబుపై ఓ ముస్లిం మహిళ వేధింపుల ఆరోపణలు చేస్తే ఏ చర్యలు తీసుకున్నారు? మంత్రి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆమె ఏడుస్తూ మీడియా ముందుకు వచ్చింది. ఆమెకు ఏం న్యాయం జరిగింది?
ఒకటికి రెండుసార్లు మాట్లాడితే నిజాలు అయిపోతాయా? మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడినా నిజాలు అయిపోతాయన్న భ్రమలో ఉన్నారు. నాడు విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై బుద్ధా వెంకన్న ఏంచెబుతారు? మహిళలకు అప్పులు ఇచ్చి అప్పు తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలను వ్యభిచారంలోకి దింపారు. నాడు మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? " అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గోరంట్ల మాధవ్ అంశంలో విచారణ అనంతరం వచ్చే నివేదికను బట్టే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more