ఉత్తరాఖండ్లో వరదల బీభత్సం కొనసాగుతుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాపై వరుణుడి ఉద్దృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా పురోలా ప్రాంతంలో భారీ వర్షాలతో ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యింది. భారీగా వస్తున్న వరదనీటితో కుమోలా నది అల్లకల్లోలంగా మారింది. ఏకధాటి వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు పాక్షికంగా, పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నది ఉద్దృత ప్రవాహంతో వరదలు సంభవిస్తున్నాయి. దీంతో పురోలా ప్రాంతంలో భారీగా అస్థినష్టం సంభవించింది. అయితే ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ క్రమంలో పురోలా ప్రాంతంలో నది వరదకు మట్టి కూడా కోసుకుపోయింది. దీంతో నది సమపంలో ఉన్న గల ఎనిమిది దుకాణాలు వదరనీటిలో కొట్టుకుపోయాయి. అందులోని ఒక షాపులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది. ఈ ఏటీఎంలో బుధవారం సాయంత్రమే 24 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లు పురోలా బ్యాంకు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే కస్టమర్లు డబ్బు ఉపసంహరణలు చేశారని.. అయితే అందుకు ఆర్బీఐ విధించిన విత్ డ్రా ఆంశలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. దీంతో మిగిలిన క్యాష్ అంతా నీటిపాలు అయినట్లే కనిపిస్తుంది.
గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కుమోల నదికి అకస్మాత్తుగా వరద ఉదృతి పెరగడంతో ఈ షాపులు కొట్టుకుపోయాయి. వాటిలో 2 నగల దుకాణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా అనేక నివాస గృహాలు, దుకాణాలకు ఇప్పటికీ ముప్పు పొంచి ఉంది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని నివాసితులంతా భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న తహసీల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు నష్టాన్ని పరిశీలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more