తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి... ఏకంగా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. ఇక ఆయన ముఖం చూసేది లేదని కూడా చెప్పారు. బహిరంగ క్షమాపణ చెప్పటమే కాదు... సదరు నేతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. బహిరంగ క్షమాపణ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
'హోంగార్డు వ్యాఖ్యలతో పాటు మునుగోడు బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్... మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి పరుషమైన పద జాలం వాడటంతో వారంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి ర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, రాష్ట్రసాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదని, తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చెన్నారెడ్డికి రేవంత్ సూచిస్తున్నాను’’ అంటూ రేవంత్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్ శనివారం మరోసారి ఎంపీ కోమటిరెడ్డికి క్షమాపణలు తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చానని.. క్షమాపణ కూడా చెప్పినట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటాననని అద్దంకి దయాకర్ ప్రకటించారు. మొత్తంగా అద్దంకి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ ను ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నేతలు కూడా అద్దంకి తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
అయితే రేవంత్ క్షమాపణలు చెప్పిన విషయం తనకు తెలియదని.. తాను వినలేదు.. చూడలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్ రెడ్డి అన్నారు. చుండూరు సభలో తనపై ఇష్టానుసారంగా నోరుపారుసుకున్న అద్దంకి దయాకర్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్ క్షమాపణ చెప్పిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పిన ఆయన తాను రేవంత్ ట్వీట్ చేసిన వీడియోను చూడలేదని, వినలేదని తెలిపారు. తనపై వాడరాని పదం వాడిన వారిని సస్పెండ్ చేయాల్సిందేనని అద్దంకి దయాకర్‌ను ఉద్దేశించి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొనే ఆలోచన లేదని చెప్పారు.
My apologies to brother and colleague @KomatireddyKVR garu. @manickamtagore @UttamINC pic.twitter.com/v7gkvXtlRD
— Revanth Reddy (@revanth_anumula) August 13, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more