స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం గుజరాత్ లో జరుగుతున్న పరిణామాలు.. ఆయన మాటలకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పెదాలు ఒకటి మాట్లాడితే.. ఆయన కళ్లు మాత్రం అందుకు భిన్నమైన అదేశాలను జారీచేస్తాయని విమర్శలు వినిపిస్తున్నాయి. యావత్ దేశం ఇంకా స్వతంత్య దినోత్సవ వేడుకలను అస్వాధిస్తున్న నేపధ్యంలో గుజరాత్ ప్రభుత్వం సహా ప్రధాని మోడీపై విమర్శల జడివానకు కారణమేంటీ.?.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహిళలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఉపన్యాసానికి ఆయన చేస్తున్న దానికి పొంతన లేదని యావత్ దేశం గమనిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ః గాంధీ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడం యావత్ దేశం గమనిస్తోందని ఆయన పట్ల విమర్శించారు. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అయిదు నెలల ప్రెగ్నెంట్ మహిళను దాహోద్ జిల్లాలో అత్యాచారం చేశారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హతమార్చారు.
గోద్రా ఘటన అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో ఐదు నెలల గర్భణీ మహిళపై అత్యంత పాశవికంగా దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన 11 మందికి 14 ఏళ్ల జైలుశిక్ష పడింది. కాగా, మహిళలను గౌరవించాలని, సమాజంలో వారి సముచిత స్థానం వారికి కేటాయించి.. వారు స్వేచ్ఛావాయువల మధ్య నిర్భయంగా జీవించేందుకు ప్రతీ ఒక్కరూ ప్రతీనబూనాలని చెప్పారు. ఇక మరోవైపు దేశ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆ రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం గోద్రా సబ్జైలు నుంచి విడుదల చేయడంపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన ప్రసంగంలో మహిళలను చూసే దృక్కోణం మారాలని, వారిని గౌరవించాలని దేశ ప్రజలను కోరారు. అయితే రేపిస్టులను విడుదల చేస్తూ ఆయన చేతల్లో అందుకు విరుద్ధంగా వ్యవహరించారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మరోవైపు బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. గర్భిణిపై సామూహిక లైంగిక దాడి, హత్యకు పాల్పడి అన్ని కోర్టుల్లో దోషులుగా తేలినవారిని విడుదల చేయడం అన్యాయానికి పరాకాష్ట కాదా అని ఆమె ప్రశ్నించారు. మహిళలను గౌరవించడం ప్రసంగాలకే పరిమితమా అని ప్రధాని నరేంద్ర మోదీని ఆమె నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more