ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఎంతలా అంటే దశాబ్దాల కాలం క్రితం ల్యాండ్ లైన్ ఫోన్లను మాత్రమే చూసిన ప్రజలకు.. ఆ తరువాత కొన్నేళ్ల వ్యవధిలోనే పేజర్లు, 2జీ ఫోన్లు, ఆ తరువాత 3జీ ఫోన్లు, వాటిని తలదన్నెలా స్మార్ట్ ఫోన్లు.. అధునాతన కెమెరాలను జోడించిన స్మార్ట్ ఫోన్లు ఇలా సాంకేతిక విప్లవంతో కార్లకే కాదు.. యంత్రికంగా కూడా సాంకేతికత జోడించడం జరిగింది. ఇక తాజాగా కార్ల తాళాలు కూడా అనేక రకాలుగా అందుబాటులోకి వచ్చాయి. తమ స్మార్ట్ ఫోన్లలోని యాప్ ల ద్వారా కూడా కార్లను తెరిచే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.
ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక కలిగిన టెస్లా కార్లకు.. చిప్ తరహా తాళాలు (కీ) వచ్చాశాయి. రిమోట్ కంట్రోలింగ్ సాంకేతికతను మించి వచ్చిన టెక్నాలజీతో టెస్లా కార్లలో ఈ ఫీచర్ చాలా మందికి తెగనచ్చేసింది. ఇలా అన్‌లాక్ చెయ్యడానికి కొన్ని చిప్‌లు ఉపయోగపడతాయి. అయితే ఈ చిప్ ను అత్యంత జాగ్రత్త కలిగిన టెస్లా కారు యజమాని ముందుజాగ్రత్తతో వ్యవహరించాడు. తన కారును ఇతరులు నడపకుండా, చౌర్యానికి గురికాకుండా.. చిప్‌ను ఏకంగా చేతిలో పెట్టించేసుకున్నాడో కారు యజమాని. అతను కొత్తగా కొన్న టెస్లా కారు లాక్ ఓపెన్ చెయ్యడానికి వివోకీ ఎపెక్స్ చిప్ ఉంటే చాలు.
దాన్ని ఏ వస్తువులోనో ఇంప్లాంట్ చేయించడం ఎందుకనుకున్నాడో ఏమోగానీ.. ఆ చిప్‌ను తన చేతిలోనే పెట్టించేసుకున్నాడు బ్రాండన్ డలాలీ అనే వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు. ‘‘నా ఫోన్ కీ సమస్యలను నా చేతుల్లోకే తీసుకోవాలని నిర్ణయించుకున్నా. టెస్లా కీ చింప్ ఇంప్లాంట్ చేయించుకున్నా’’ అనే క్యాప్షన్‌తో అతను వీడియో పోస్టు చేశాడు. చిప్ పెట్టిన తర్వాత కారు తాళం తీసేందుకు సెన్సార్ల వద్ద అతని చేతిని ఉంచితే చాలు.. టక్కున లాక్ ఓపెన్ అయిపోతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బ్రాండన్‌ను పొగడాలో, తిట్టాలో తెలియక తికమక పడిపోతున్నారు.
@elonmusk
— Brandon Dalaly (@BrandonDalaly) August 16, 2022
Finally decided to take my phone key issues in to my own hands... literally. Tesla key chip implant. pic.twitter.com/RVK8ZaePoI
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more