పెగాసస్ స్పైవేర్ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెగాసెస్ స్పైవేర్ ను వినియోగించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల కాల్ప్ ను చాటుగా వింటున్నారన్న అరోపణలపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశంపై కొందరు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ అంశంలో నిజనిర్థారణకు రిటైర్డు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అర్ వి రవీంద్రన్ నేతృత్వంలో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికను ఇవాళ అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది.
ఈ కేసు దర్యాప్తుకు ప్రభుత్వం సహకరించలేదని కమిటీ పేర్కోంది. కాగా, కేసు పరిశీలనలో తమకు అందిన 29 ఫోన్లను పరీక్షించగా, దాంట్లో అయిదు ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్లు గమనించామని కమిటీ నివేదిక పేర్కోందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కానీ ఒక్క ఫోన్లో కూడా పెగాసస్ స్పైవేర్ ఉన్నట్లు గుర్తించలేదు అని కోర్టు తెలిపింది. అయితే పెగాసస్ అంశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే చాలా విషయాలు వెల్లడయ్యేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీనే ఈ రిపోర్ట్‌ను తయారు చేస్తోంది. మూడు భాగాలుగా రిపోర్ట్‌ను ఇవ్వనున్నారు. దీంట్లో రెండు టెక్నికల్ కమిటీ రిపోర్ట్లు ఉంటాయి. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ మరో నివేదికను సమర్పిస్తారు. రవీంద్రన్ సమర్పించే నివేదికను తమ వెబ్సైట్లో పబ్లిక్‌గా పెట్టనున్నట్లు సీజేఐ తెలిపారు. తొలి రెండు భాగాలకు చెందిన రిపోర్ట్ కావాలని కొందరు పిటిషనర్లు అడగ్గా దానిపై పరిశీలిస్తామని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసు విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు. కేసును విచారించిన ధర్మాసనంలో సీజేఐ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more