రైల్వేఉద్యోగ పరీక్షలో గట్టేందుకు ఓ అభ్యర్థి తన అతితెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యాడు. రైల్వే పరీక్షలలో తనకు బదులుగా స్నేహితుడితో పరీక్ష రాయించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అదెలా అంటే బయోమెట్రిక్ గుర్తింపు కోసం తన బొటనవేలు చర్మాన్ని స్నేహితుడి వేలుకు అంటించాడు. అయితే కరోనా కారణంగా అందుబాటులోకి వచ్చిన శానిటైజర్ వారి ఆటను కట్టించింది. అదెలా అంటే పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థి కాసింత భయాందోళనకు గురయ్యాడు. దీంతో అతనిని అనుమానించిన పర్యవేక్షకుడు చేతిపై శానిటైజర్ పోయగా అతికించిన చర్మం కాస్తా ఊడిపోయింది. దీంతో నకిలీ అభ్యర్థితోపాటు అసలు అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గుజరాత్‌లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల మనీష్ కుమార్, ఎలాగైనా రైల్వేలో ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. డీ గ్రూప్ పోస్టు కోసం దరఖాస్తు చేశాడు. అయితే చదువులో మెరుగైన తన క్లాస్మేట్, స్నేహితుడు రాజ్యగురు గుప్తాతో రైల్వే ప్రవేశ పరీక్ష రాయించాలని భావించాడు. దీనికి అతడి సహాయం కోరి ఒప్పించాడు. కాగా, పరీక్ష కేంద్రం వద్ద బయోమెట్రిక్ గుర్తింపులో స్నేహితుడే తానుగా నమ్మించేందుకు మనీష్ కుమార్ ప్లాన్ వేశాడు. అయితే బయోమెట్రిక్ ఆధారంగా పరీక్షలు జరుగుతున్న విషయం కూడా తెలిసిన మనీష్.. అదే తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు.
ఒక్క వారం, పది రోజులు కష్టపడినా పర్వాలేదు, కానీ ఉద్యోగం అంటూ వస్తే మాత్రం తాను జీవితాంతం సుఖంగా ఉండవచ్చునని భావించి తన ప్లాన్ ను అమలు చేశాడు. సరిగ్గా పరీక్షకు ముందు రోజు కాలుతున్న పెన్నంపై తన బొటనవేలు ఉంచాడు. వేడికి కమిలి ఊడిన పైచర్మాన్ని మెల్లగా తొలగించి రాజ్యగురు గుప్తా కుడి చేయి బొటనవేలికి అంటించాడు. రైల్వే పరీక్షకు తనకు బదులుగా స్నేహితుడ్ని గుజరాత్‌కు పంపాడు. ఈ నెల 22న వడోదరలోని లక్ష్మీపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి మనీష్ కుమార్ తరుఫున అతడి స్నేహితుడు రాజ్యగురు గుప్తా హాజరయ్యాడు.
అయితే బయోమెట్రిక్ గుర్తింపు కోసం బొటనవేలితో ప్రయత్నించగా పలుసార్లు విఫలమైంది. మరోవైపు, రాజ్యగురు గుప్తా తన కుడి చేతిని ఫ్యాంటు జేబులో దాచి ఉంచడంతో పరీక్షా పర్యవేక్షకుడు అనుమానించాడు. తనిఖీ కోసం కుడి చేతి బొటనవేలిపై శానిటైజర్ పోశాడు. దీంతో అంటించిన చర్మం ఊడింది. ఈ నేపథ్యంలో రాజ్యగురు గుప్తాను పోలీసులకు అప్పగించారు. అతడు అసలు విషయం చెప్పడంతో రైల్వే పరీక్షలో మోసం చేసేందుకు ప్రయత్నించిన అసలు అభ్యర్థి మనీష్ కుమార్‌తోపాటు చీటింగ్‌కు సహకరించిన స్నేహితుడు రాజ్యగురు గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more