అదో ప్రముఖ ప్రైవేటు పాఠశాల. ఈ పాఠశాలలో తమ పిల్లలు విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థానాలకు వెళ్లేలా పాఠశాల యాజమాన్యమే చూసుకుంటుంది అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే పాఠశాలను ఏరి, కోరి.. ఫిజులు భారాన్ని భరిస్తూ చదివిస్తుంటారు. అయితే ఆయా పాఠశాలల్లో అసలు ఏం జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. తాజాగా ఓ ప్రముఖ పాఠశాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పాఠశాలలోని విద్యార్థినులకు చెందిన ఈ వీడియో.. ఆ స్కూల్ యాజామాన్యం, ఉపాధ్యాయులు పర్యవేక్షణను తెలియజేస్తుండగా, అదే సమయంలో విద్యార్థినుల ప్రవర్తనకు కూడా దర్పణం పడుతోంది.
ఇంతకీ ఏంటా వీడియో అంటారా.. ఈ ప్రముఖ పాఠశాలకు చెందిన విద్యార్థినులు శిగపట్లు పట్టుకున్నారు. అంతేకాదు ఓ వైపు జుట్లు పట్టుకున్నా.. మరోవైపు కోట్టుకున్నారు. ఏదో పాఠశాలకు చెందిన గ్రౌండ్ లో ఈ ఘటన చోటుచేసుకోలేదు... ఏకంగా తరగతి గదిలోనే కొట్టుకున్నారు. వారి శిగపట్లను చూసి బెదిరిపోయిన మిగతా బాలికలు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బాలికలు తరగతి గదిలో కొట్టుకున్నారు. స్కూల్ యూనిఫాంలో ఉన్న ముగ్గురు బాలికలు ఒకరి జట్టు మరొకరు పట్టుకున్నారు. ఆపై చేతులతో కొట్టుకున్నారు.
అయితే ఆ క్లాస్‌లోని మిగతా బాలికలు సర్దిచెప్పేందుకు, వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ జుట్లపట్టు వీడని ఆ బాలికలు చాలా సేపు కొట్టుకున్నారు. కాగా, జర్నలిస్ట్ అమిత్ సింగ్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘కాన్పూర్‌లోని ప్రసిద్ధ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఈ అమ్మాయిల వీడియో చాలా వైరల్ అవుతోంది. ఈ హైస్కూల్ విద్యార్థులు స్కూల్ సమయంలో ఇలా ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు’ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘ఎక్స్ట్రా కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ఫుల్ మార్కులు’ అంటూ ఒకరు చమత్కరించారు. కాగా, తమ స్కూళ్లలో కూడా ఇలాంటి ఫైటింగ్‌లు జరిగినట్లు మరి కొందరు గుర్తు చేసుకున్నారు.
कानपुर में एक नामी निजी स्कूल की इन लड़कियों की ये पटकम-पटकाई का वीडियो खूब वायरल हो रहा है। हाईस्कूल की ये स्टूडेंट्स स्कूल ऑवर्स में ही एक दूसरे से भिड गईं।#Kanpur pic.twitter.com/BQGyza6Rqd
— Amit Singh (@amit3_singh) August 27, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more