జార్ఖండ్‌లోని ఒక బీజేపీ నాయకురాలు అత్యంత దారుణంగా, అమానవీయంగా వ్యవహరించింది. అమె చేసే ఘోరాలు చూసి భరించలేని అమె కొడుకే.. ఇవి. గిరిజన పనిమనిషిని పెట్టిన చిత్రహింసలు ఇవి. ఆ నాయకురాలి కొడుకు సాయంతో ఆ నరకం నుంచి బయటపడింది ఆ మహిళ. ఆ నాయకురాలిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ప్రస్తుతం ఆమె జైలు ఊచలు లెక్కపెడుతోంది. పనిమనిషిని దారుణంగా హింసించిన బీజేపీ మాజీ నేత సీమా పాత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం సహా పలు సంబంధిత చట్టాల్లోని సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి పంపించింది.
సీమా పాత్ర. జార్ఖండ్‌లో బీజేపీ లీడర్. పార్టీ మహిళా విభాగం జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యురాలు. భర్త మహేశ్వర్ పాత్రా మాజీ ఐఏఎస్ అధికారి. వారి ఇంట్లో గిరిజన మహిళ సునీత(29) పదేళ్లుగా పని చేస్తోంది. ఆ పనిమనిషిపై సీమా పాత్రా చేయని ఘోరం లేదు. చిన్న చిన్న కారణాలు చూపి ఆమెను దారుణంగా హింసించేది. ఐరన్ పాన్‌తో నోటిపై కొడితే పళ్లు రాలాయి. టాయలెట్‌ను నాలికతో క్లీన్ చేయించింది. ఫ్లోర్‌పై పడిన యూరిన్‌ను నాకించింది. ఆ పనిమనిషి దేహమంతా గాయాలే. ఒళ్లంతా వాతలే. కారణం లేకుండానే వేడివేడి గరిటతో వాత పెట్టేది. రోజుల తరబడి అన్నం పెట్టేది కాదు. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇచ్చేది కాదు. గత పదేళ్లుగా ఈ చిత్రహింసలను సునీత భరిస్తోంది.
ఆ నాయకురాలి కుమారుడు ఆయుష్మాన్ పాత్రా ఈ దారుణాల్ని చూడలేకపోయేవాడు. సాధ్యమైనంతగా ఆ పనిమనిషికి సాయం అందించేవాడు. ఎంత వారించినా తల్లి వినకపోవడంతో.. ఈ దారుణాలను తన స్నేహితుడు వివేక్ ఆనంద్ బస్కీకి వివరించాడు. తన తల్లి పనిమనిషిని చిత్రహింసలు పెడుతున్న కొన్ని వీడియోలను షేర్ చేశారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగి అయిన ఆ స్నేహితుడు వెంటనే ఆ వీడియోలతో పోలీసులను ఆశ్రయించాడు. వారు సీమా పాత్రా ఇంటిపై దాడి చేసి పనిమనిషి సునీతను కాపాడి, ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ సమాచారం ముందే అందుకున్న సీమా పాత్ర తప్పించుకుని పోతుండగా, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దుర్మార్గాల్లో సీమా పాత్రా భర్త పాత్ర లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన, సంబంధిత వీడియోలు వైరల్ అయ్యాయి. రాజకీయంగా పెను దుమారం లేచింది. స్వయంగా గవర్నర్ రమేశ్ బియాస్ రాష్ట్ర డీజీపీని పిలిపించుకుని దీనిపై ఆరా తీశారు. అయితే, బీజేపీ లీడర్‌ను కాబట్టి, తనపై ఈ కుట్ర పన్నారని, తాను అమాయకురాలినని సీమా పాత్ర తెలిపారు. ఈ దారుణాలు వెలుగులోకి రావడంతో సీమా పాత్రాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more